గోరఖ్‌పూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఆదిత్యనాథ్ పోటీ

గోరఖ్‌పూర్‌  అసెంబ్లీ స్థానం నుంచి ఆదిత్యనాథ్ పోటీ

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తూర్పు యూపీలోని స్వస్థలమైన గోరఖ్‌పూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. గోరఖ్‌పూర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన చరిత్ర ఉండటంతో అక్కడే నుంచే ఆయన ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.    యోగి 1998, 1999, 2004, 2009, 2014 సార్వత్రిక ఎన్నికలలో వరుస విజయాలను నమోదు చేసి, గోరఖ్‌పూర్‌ నుండి ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. అంతేకాకుండా అ త్యంత ప్రజాదరణ పొందిన గోరఖ్‌నాథ్‌ మఠానికి అధిపతిగా ఉన్నారు. గోరఖ్‌పూర్‌ నుండి పోటీ చేయడం ద్వారా, యోగికి యూపీలోని ఇతర ప్రాంతాలపై దృష్టి పెట్టడానికి ఎక్కువ సమయం ఉంటుందని పార్టీ భావించి ఆయన్ను ఇక్కడ నుంచే పోటీకి నిలిపింది.

 

Tags :