ASBL NSL Infratech

భోళా శంక‌ర్ త‌ర్వాత చిరూ ఎవరితో?

భోళా శంక‌ర్ త‌ర్వాత చిరూ ఎవరితో?

టాలీవుడ్ లోని యంగ్ హీరోల‌కు ఏ మాత్రం తీసిపోకుండా, గ‌ట్టి పోటీ ఇస్తున్నాడు చిరంజీవి. సంవ‌త్స‌రానికి రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు చిరూ. రీ ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి చిరూ ఎలాంటి బ్రేక్ లు తీసుకోకుండా వెంట వెంట‌నే సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తూ వ‌స్తున్నాడు. 

ప్ర‌స్తుతం చిరూ, మెహ‌ర్ ర‌మేష్ తో భోళా శంక‌ర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆఖ‌రి ద‌శ‌లో ఉంది. ఈ సినిమా త‌ర్వాత చిరూ కొన్ని నెల‌ల బ్రేక్ తీసుకోబోతున్న‌ట్లు అర్థ‌మ‌వుతుంది. దానికి కార‌ణం ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న త‌న త‌ర్వాతి సినిమాను అనౌన్స్ చేయ‌క‌పోవ‌డ‌మే. ఎంతో మంది ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర ఎన్నో క‌థ‌లు విన్న చిరూ, ఇప్ప‌టికీ ఏ స్టోరీ ని ఫైన‌ల్ చేయ‌లేదు. 

వాస్త‌వానికి చిరూ, భోళా శంక‌ర్ త‌ర్వాత వెంకీ కుడ‌ములతో దానయ్య బ్యాన‌ర్‌లో సినిమా చేయాల్సింది కానీ క‌థ విష‌యంలో చిరూ అసంతృప్తిగా ఉండ‌టంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. దీంతో చిరూ కోసం దాన‌య్య మ‌రో స్టోరీని, మ‌రో డైరెక్ట‌ర్‌ని అన్వేషిస్తున్నారు. దాన‌య్య అన్వేషించేలోపు మ‌రో నిర్మాత చిరూని మెప్పించే క‌థ‌తో వ‌స్తే ఆ సినిమాతో చిరూ సెట్స్ కి వెళ్లే ఛాన్సుంది. ఏదేమైనా స‌రే మెగాస్టార్ నుంచి భోళా శంక‌ర్ త‌ర్వాత మ‌రో సినిమా రావాలంటే వ‌చ్చే స‌మ్మ‌ర్ త‌ర్వాత వ‌ర‌కు ఆగాల్సిందే అని బాగా అర్థ‌మ‌వుతుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :