ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

చైనాలో ఒక్కరోజే 3.7 కోట్ల మందికి

చైనాలో ఒక్కరోజే 3.7 కోట్ల మందికి

చైనాలో కరోనా వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఒక్క రోజులోనే 3.7 కోట్ల మందికి వైరస్‌ సోకందని బ్లూమ్‌బర్గ్‌ సంస్థ పేర్కొంది. కరోనా ప్రభావం మొదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులో ఈ స్థాయి కేసులో నమోదు కావడం కూడా ఇదే తొలిసారి. ఈ కథనం డిసెంబర్‌ మొదటి 20 రోజుల్లో 24.8 కోట్ల మంది చైనా  ప్రజలు వైరస్‌ బారిన పడ్డారు. ఇది ఆ దేశ జనాభాలో దాదాపుగా 18 శాతం. రాజధాని బీజింగ్‌, సిచువాన్‌ ప్రావిన్స్‌లో దాదాపుగా సగం మందికి వైరస్‌ సోకింది. చైనాకు చెందిన నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ అంతర్గత సమావేశంలో అధికారులు ఈ అంచనా వేశారు. ఈ సమావేశం వివరాలు బయటకు పొక్కడంతో ఈ లెక్కలు  బహిర్గతమయ్యాయి. అయితే ఈ అంచనా ఎలా వేశారనేది మాత్రం వెల్లడికాలేదు. దీనిపైన స్పందించేందుకు కూడా ఈ సంస్థ నిరాకరించింది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :