ASBL NSL Infratech

డీజీసీఏ కీలక ఆదేశాలు... వారికి పక్కనే సీటివ్వాలి

డీజీసీఏ కీలక ఆదేశాలు... వారికి పక్కనే సీటివ్వాలి

డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలచ్చింది. 12 ఏళ్ల చిన్నారులకు అదే పీఎన్‌ఆర్‌ నంబర్‌పై ప్రయాణిస్తున్న తల్లిదండ్రులు లేదా సంరక్షుకుల్లో ఒకరి పక్కన సీటు కేటాయించాలని సూచించింది. విమానాల్లో  కొన్నిసార్లు చిన్నారులకు తల్లిదండ్రులతో కాకుండా వేరుగా సీటు కేటాయిస్తున్న ఉదంతాల నేపథ్యంలో డీజీసీఏ ఈ ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించిన రికార్డులను నిర్వహించాలని  సూచించింది. ఈ మేరకు నిబంధనలు సవరిస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది. విమాన సంస్థలకు సంబంధించిన కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించింది. జీరో బ్యాగేజీ, సీట్ల  ప్రాధాన్యం, మీల్స్‌/ స్నాక్స్‌ / డ్రిరక్స్‌,  సంగీత వాయిద్య పరికరాల తీసుకెళ్లడానికి రుసుములు వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఐచ్చిఖంగా ఉండాలని సూచించింది. తప్పనిసరి చేయకూడదని తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :