ASBL NSL Infratech

ర‌జినీని బాబీ హ్యాండిల్ చేయ‌గ‌ల‌డా?

ర‌జినీని బాబీ హ్యాండిల్ చేయ‌గ‌ల‌డా?

చిరంజీవితో వాల్తేరు వీర‌య్య సినిమా తీసి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన బాబీ త‌ర్వాతి సినిమా ఏంటి అనేది ఇప్ప‌టికీ అనౌన్స్ చేయ‌లేదు. వాల్తేరు వీర‌య్య వ‌చ్చి మూడు నెల‌లు నిండినా బాబీ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పట్లేదు. కానీ ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల్లో మాత్రం బాబీ, సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌ను డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌నే వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

అది కూడా దిల్ రాజు బ్యాన‌ర్‌లో. దీంతో ఈ సినిమా అనౌన్స్మెంట్ రాకుండానే అంచ‌నాలు నెల‌కొన్నాయి. అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాకుండా ఏం చెప్ప‌లేం కానీ ఆ వార్త‌ల్లో కొంచెమైనా నిజం లేక‌పోతే ఇప్ప‌టికే ఆ వార్త‌ల్ని ఎవ‌రొక‌రు కొట్టిపారేసేవారు. ర‌జినీని బాబీ డైరెక్ట్ చేసే అవ‌కాశం వ‌చ్చింద‌నేది నిజ‌మైతే మాత్రం బాబీ న‌క్క తోక తొక్కిన‌ట్లే. 

అయితే ఇదంతా విన‌డానికి బానే ఉంది కానీ అస‌లు బాబీ, ర‌జినీని ఆయ‌న ఇమేజ్‌ను మోయ‌గ‌ల‌డా అనే అనుమానం ఫ్యాన్స్ కు క‌లుగుతుంది. ఎందుకంటే బాబీకి హిట్లున్నా స‌రే బాబీ డైరెక్ష‌న్ సూప‌ర్ అనే పేరు వ‌చ్చిన దాఖ‌లాలు చాలా త‌క్కువ‌. బాబీ మ్యాట‌ర్‌లో చెప్పుకోద‌గ్గ హిట్ అంటే ప‌వ‌ర్ ఒక్క‌టే. అలాంటి ట్రాక్ రికార్డుతో బాబీ ర‌జినీని ఏ మేర‌కు బ్యాలెన్స్ చేయ‌గ‌ల‌డ‌నేది ఇప్పుడు అంద‌రికీ ప్ర‌శ్న‌గా మారింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :