ASBL NSL Infratech

యాపిల్ కు బైడెన్ ప్రభుత్వం షాక్ ... నిషేధం అమల్లోకి!

యాపిల్ కు బైడెన్ ప్రభుత్వం షాక్ ... నిషేధం అమల్లోకి!

అమెరికాకు చెందిన టెక్‌ దిగ్గజం యాపిల్‌ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీకి చెందిన రెండు స్మార్ట్‌ వాచ్‌ లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు బైడెన్‌ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఆ వాచ్‌ల విక్రయాలపై నిషేధం అమల్లోకి వచ్చింది. అమెరికాలో న్యూ ఇయర్‌ హాలీడే వేళ ఈ నిషేధం పడటంతో యాపిల్‌ భారీగా నష్టపోయే అవకాశముంది. యాపిల్‌ ఇటీవల విడుదల చేసిన సిరీస్‌ 9, అల్ట్రా 2 వాచ్‌లకు పేటెంట్‌ సమస్య ఎదురైంది.  వీటిల్లోని బ్లడ్‌ ఆక్సిజన్‌ స్థాయిలను కొలిచే ఫీచర్‌ విషయంలో తమ పేటెంట్‌ను యాపిల్‌ ఉల్లంఘించిందంటూ మాసిమో కార్పొరేషన్‌, మరో కంపెనీ దావా వేశాయి. దీంతో ఈ రెండు మోడళ్లపై ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ కమిషన్‌ అక్టోబరులో నిషేధం విధించింది. అయితే, దీనిని పున సమీక్షించేందుకు 60 రోజుల గడువు విధించింది. 

ఈ నిషేధాన్ని తొలగించేలా అధ్యక్షుడు జో బైడెన్‌కు వీటో అధికారం ఉంది. కానీ, యాపిల్‌ విషయంలో జోక్యం చేసుకునేందుకు వైట్‌హౌస్‌ తాజాగా నిరాకరించింది. ఈ వాచ్‌ మోడళ్లపై నిషేధం విధిస్తూ ఐటీసీ తీసుకున్న నిర్ణయంలో యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ కేథిరన్‌ తాయ్‌ ఎలాంటి మార్పులు చేయలేదని అధికారులు వెల్లడించారు. దీంతో వీటి విక్రయాలపై డిసెంబరు 26 నుంచి నిషేదాజ్ఞలు అధికారికంగా అమల్లోకి వచ్చినట్లయ్యింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :