ASBL NSL Infratech

నవంబర్ 18న థియేటర్స్ లో 'బెస్ట్ కపుల్' 

నవంబర్ 18న థియేటర్స్ లో 'బెస్ట్ కపుల్' 

వన్ మీడియా ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై పార్థు రెడ్డి నిర్మాతగా జయంత్ వదాలి, శగ్న శ్రీ, చలకి చంటి, ఇమ్మనుయెల్ తదితరులు తెరకెక్కిన చిత్రం బెస్ట్ కపుల్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 18న థియేటర్స్ లో విడుదల కానుంది.  రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తున్నారు, అదే కోవలో మా బెస్ట్ కపుల్ సినిమా విజయం సాధిస్తుందని నిర్మాత పార్థు రెడ్డి తెలిపారు. భార్య భర్తల మధ్య జరిగే సంభాషణలు, గొడవలు, ప్రేమాభిమానాలు ఇలా అన్ని ఈ సినిమాలో పొందుపరచడం జరిగింది. అందరికి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ బెస్ట్ కపుల్ మూవీలో ఉన్నాయని డైరెక్టర్ గణేష్ దోరాల తెలిపారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :