ASBL NSL Infratech

సమంతకు గుడి కట్టిన వీరాభిమాని ... ఎక్కడంటే ?

సమంతకు గుడి కట్టిన వీరాభిమాని ... ఎక్కడంటే ?

సినీనటి సమంత పై అభిమానంతో ఆమె కోసం ఏకంగా గుడి కట్టాడు ఓ అభిమాని.  బాపట్ల జిల్లా చుండూరు మండలం అలపాడుకు చెందిన తెనాలి సందీప్‌ నటి సమంతకు వీరాభిమాని. ఆమె నటనతో పాటు పలు సేవా కార్యక్రమాలకు, ముఖ్యంగా ప్రత్యూష ఫౌండేన్‌ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంలో సమంత చూపిన చొరవకు ఆకర్షితుడైయ్యాడు సందీప్‌. అనారోగ్యం పాలైన చిన్న పిల్లలకు పునర్జన్మ ప్రసాదిస్తున్న ఆమెపై అభిమానం రెట్టింపవ్వడంతో గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు.  తన ఇంటి ప్రాంగణంలోనే ఆలయ కోసం స్థలం కేటాయించి విగ్రహాన్ని కూడా తయారు చేయించాడు. ప్రస్తుతం విగ్రహానికి, గుడికి తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. ఈ నెల 28వ తేదీన ఆలయం ప్రారంభిస్తున్నట్లు సందీప్‌ తెలిపారు. ఇప్పటి వరకు సమంతనూ నేరుగా చూడలేదని, కేవలం ఆమెపై అభిమానంతోనే గుడి నిర్మిస్తున్నట్లు తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :