ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

చైనాలో మళ్ళీ కరోనా విలయతాండవం..! మళ్లీ ముప్పు పొంచి ఉందా..?

చైనాలో మళ్ళీ కరోనా విలయతాండవం..! మళ్లీ ముప్పు పొంచి ఉందా..?

చైనాలో పరిస్థితులు ఏమాత్రం బాగున్నట్టు కనిపించడం లేదు. చైనాలో పరిస్థితులపై ఆ దేశస్థులు పలు సోషల్ మీడియా వేదికల్లో అక్కడి పరిస్థితిని వివరిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాలపై వాళ్లంతా మండి పడుతున్నారు. ముఖ్యంగా జీరో కోవిడ్ పాలసీతో తాము పడుతున్న ఇబ్బందులపై గళమెత్తుతున్నారు. వీధుల్లోకి వచ్చి ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నారు. చైనాలో ఆరు నెలల తర్వాత తొలి కోవిడ్ మరణం నమోదైంది. దీంతో జిన్ పింగ్ ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు కఠినతరం చేసింది. కరోనా ప్రభావిత ప్రాంతాలన్నింటినీ దిగ్బంధం చేసేసింది. ఆ ప్రాంతాల్కు వెళ్లిన వాళ్లందరినీ క్వారైంటైన్ కేంద్రాలకు తరలిస్తోంది. జిన్ పింగ్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోందంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

చైనాలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. రోజురోజుకూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజుకు సగటున 30వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి కోవిడ్ అనుమానితులందరినీ బలవంతంగా అందులో నిర్బంధిస్తోంది. అయితే కంపెనీల్లో ఉత్పత్తి ఆగకుండా చూడాలనే నిబంధనలు విధించింది. దీంతో కంపెనీలనే క్వారంటైన్ కేంద్రాలుగా మార్చేసింది. దీంతో కార్మికులు, సిబ్బంది అందులోనే నెలలతరబడి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ప్రభుత్వంపై ఉద్యోగాలు, కార్మికులు, ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

చైనా ప్రభుత్వ జీరో కోవిడ్ పాలసీపై ప్రజలు విసిగిపోయారు. జిన్ పింగ్ ప్రభుత్వం అణచివేత విధానాలను నిరసిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. ఇన్నాళ్లూ జిన్ పింగ్ పాలనపై ప్రజలెవరూ నోరు మెదపలేదు. అయితే ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చాక నియంతృత్వ ధోరణి మరింత పెరిగిపోయిందనే భావన ప్రజల్లో కనిపిస్తోంది. అందుకే ప్రభుత్వ నియంత్రణను ఖాతరు చేయట్లేదు. రోడ్లపైకి వచ్చి నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ నిర్బంధాన్ని ఇక ఎంతమాత్రం సహించే పరిస్థితిలో లేమని తెగేసి చెప్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నా ఇళ్లు దాటి బయటకు వస్తున్నారు.

చైనాలోనే కరోనా పుట్టింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కలిగిన నష్టం అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయనే వార్త ప్రపంచ దేశాలన్నింటినీ మరోసారి కలవరానికి గురి చేస్తోంది. ఈ మాయదారి రోగం ఇంకెన్ని దేశాలకు వ్యాపిస్తుందో.. ఎంతమందిని బలి తీసుకుంటుందోననే ఆందోళన మొదలైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను సైతం కరోనా తీవ్రంగా ప్రభావితం చేసింది. దీనంతటికీ కారణం చైనాయేనని ప్రపంచదేశాలన్నీ నమ్ముతున్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే మళ్లీ మొదలవుతుందోమోననే భయం మొదలైంది. ఇప్పటికే పలు దేశాలు ఆర్థికమాంద్యంలో చిక్కుకున్నాయి. వచ్చే ఏడాది దీని ప్రభావం మరింత ఉంటుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా ఎలాంటి ముప్పు తెస్తుందోననే భయం మొదలైంది.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :