ASBL NSL Infratech

ఆపిల్ చేతికి జర్మన్ స్టార్టప్!

ఆపిల్ చేతికి జర్మన్  స్టార్టప్!

టెక్‌ దిగ్గజం ఆపిల్‌ సంస్థ జర్మన్‌ స్టార్టప్‌ సంస్థను కొనుగోలు చేయాలని యాపిల్‌ సంస్థ యోచిస్తోంది. బ్రైటర్‌-ఏఐ అనే ఈ స్టార్టప్‌ ముఖకవలికల గుర్తింపు, లైసెన్స్‌ ప్లేట్‌ డేటాలో ప్రత్యేకతను కలిగివుంది. టెక్‌ దిగ్గజం తన మిక్డ్స్‌ రియాలిటీ (ఎంఆర్‌) హెడ్‌సెట్‌ విజన్‌ ప్రోలో గోప్యతా లక్షణాలను మెరుగుపరచడానికి ఈ స్టార్టప్‌ టెక్నాలజీని ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆపిల్‌ విజన్‌ ప్రో పబ్లిక్‌ ఫోటోలు లేదా వీడియోలలో గుర్తించదగిన సమాచారాన్ని సంగ్రహించే ప్రమాదాన్ని  తగ్గించడానికి బ్రెటర్‌ ఏఐ సాంకేతికతను ఉపయోగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు నివేదించబడిరది. పుటేజీని క్యాప్చర్‌ చేయడంలో ఈ టెక్నాలజీ ప్రభావ వంతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫోటో, వీడియో క్యాప్చర్‌ కోసం భవిష్యత్‌ పరికరాలలో కూడా ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.

విజన్‌ ప్రోతో మీడియాను క్యాప్చర్‌ చేస్తున్నప్పుడు, ముందు ప్యానెల్‌లో ఒక సూక్ష్మ దృశ్య క్యూ కనిపిస్తుందని, బ్రైటర్‌ ఏఐ  అనుధానత టెక్నాలజీ సాంకేతికతను అందిస్తుంది. ఇది డేటాలోని అస్పష్టతను తొలగించగలదు. ఇది సహజమైన  ప్రదర్శనలను కొనసాగిస్తూనే మెరుగైన ఇమేజీ, దృశ్యాలను సాధిస్తుంది. ఆపిల్‌ సంస్థ అధికారికంగా విజన్‌ ప్రోను ఫిబ్రవరి 2న అమెరికాలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. విజన్‌ ప్రో కోసం 600 యాప్‌లు గేమ్‌లు సిద్ధం చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :