ASBL NSL Infratech

శాకుంత‌లంతో అనుష్క విలువ తెలిసొచ్చింది

శాకుంత‌లంతో అనుష్క విలువ తెలిసొచ్చింది

ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా స‌రే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అంద‌రూ చేయ‌లేరు. ఆడియ‌న్స్ లో త‌మ‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ ఉన్న వాళ్లు, ఏ క్యారెక్ట‌ర్ చేసినా స్వీక‌రించడానికి స‌రిపోయేంత మార్కెట్ సంపాదించిన హీరోయిన్లు మాత్ర‌మే బాక్సాఫీస్ ని, మార్కెట్ ని శాసించ‌గ‌ల‌రు. 

శాకుంత‌లం రిజ‌ల్ట్ ట్రేడ్ వ‌ర్గాల‌కు, స‌మంత ఫ్యాన్స్‌కు గ‌ట్టి షాక్ ఇచ్చింది. సినిమా క‌నీసం యావ‌రేజ్ అయినా ఇంత‌లా ఫీల‌య్యే వాళ్లు కాదేమో కానీ రుద్రుడు సినిమాకి పోటీ ఇవ్వ‌లేనంత దారుణంగా ఈ సినిమా రిజ‌ల్ట్‌ను ఊహించ‌లేదు. అస‌లు స‌మంత‌ను శ‌కుంత‌ల‌గా ఫ్యాన్స్ ఊహించుకోలేక‌పోయారు. దానికితోడు సొంత డ‌బ్బింగ్ ఇంకా డ్యామేజ్ చేసింది. 

ఇలాంట‌ప్పుడే అనుష్క గుర్తొస్తుంది. ఓన్లీ త‌న స్క్రీన్ ప్రెజెన్స్ తో ఓపెన్సింగ్ రాబ‌ట్టే అనుష్క‌, అరుంధ‌తి సినిమాతో స్టార్ హీరో లేకుండా ఫామ్ లో లేని కోడి రామ‌కృష్ణ ఏం హిట్ కొడ‌తాడులే అనుకున్న టైమ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టింది. పంచాక్ష‌రి లాంటి సినిమాకు కూడా ఓపెనింగ్స్ వ‌చ్చాయంటే దానికి అనుష్క ఇమేజే కార‌ణం. 

భాగ‌మ‌తి హిట్ అయినా, నిశ్శ‌బ్దం ఓటీటీ అంత భారీ మొత్తానికి ఓటీటీ బిజినెస్‌కి అయినా, ఆఖ‌రికి గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రుద్ర‌మ‌దేవి డే1 ప‌ది కోట్ల‌కు పైగా వ‌సూలు చేసినా అంతా అది అనుష్క బ్రాండ్ వ‌ల్లే. స‌మంత ఎంత మంచి న‌టి అయినా, ఇలాంటి సినిమాలు ఆమె వ‌ల్ల కావ‌ని శాకుంత‌లం నిరూపించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :