ASBL NSL Infratech

కోడిగుడ్డుతో కరోనాకు చెక్!

కోడిగుడ్డుతో కరోనాకు చెక్!

కరోనా స్పైక్‌ ప్రొటీన్‌ మన కణాల్లోకి  చేరకుండా అడ్డుకట్ట వేసే యాంటీబాడీలను కాలిఫోర్నియా వర్సిటీ (యూసీ డేవిస్‌) పరిశోధకుల బృందం కోడిగుడ్లలో అభివృద్ధి చేసింది. ఈ పరిశోధనలో భాగంగ వారు మూడు వేర్వేరు టీకాలను రెండేసి డోసుల చొప్పున కోళ్లకు ఇచ్చారు. టీకా చివరిడోసు ఇచ్చిన 3, 6 వారాల తర్వాత ఆ కోళ్లు పెట్టిన గుడ్లలోని పచ్చసొనలో, రక్తంలో యాంటీబాడీలు ఏమైనా ఉన్నాయోమో పరీశించారు. వాటిని శుద్ధి చేసి అవి కరోనా వైరస్‌ కణాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకోగలుగుతున్నాయో లేదో ల్యాబ్‌లో మానవ కణాలపై పరీక్షించారు. అవి సమర్థంగా అడ్డుకోగలుగుతున్నట్లు నిర్ధారించుకున్నారు.

సాధారంగా పక్షి జాతుల్లో ఉత్పత్తి అయ్యే ఐజీవై రకం యాంటీబాడీలను మనుషుల్లో ఐజీజీ రకం యాంటీబాడీలతో పోల్చవచ్చు. ఐజీవై రకం యాంటీబాడీలను మనుషుల శరీరాల్లోకి ప్రవేశపెట్టినా వాటిపై రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించదు. వాటివల్ల అలర్జీలు రావు, ఇవిపక్షుల సీరమ్‌లోని గుడ్లలోనూ ఉంటాయి. ఈ యాంటీబాడీలతో కరోనా బాధితులకు వైరస్‌కు ఎక్స్‌పోజ్‌ అయినవారికి చికిత్స చేయవచ్చని అధ్యయనంలో వెల్లడైంది. ఈ విధానంలో తక్కువ ఖర్చుతోనే యాంటీబాడీలను తయారు చేయొచ్యని అ అధ్యయనంలో పాలుపంచుకున్న యూసీ డేవిస్‌ ప్రొఫెసర్‌ రోడ్రిగో గలార్డో తెలిపారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :