ASBL NSL Infratech

బ‌న్నీ నో చెప్పడానికి రీజ‌న్ అదేనా?

బ‌న్నీ నో చెప్పడానికి రీజ‌న్ అదేనా?

ఎప్పుడైనా ఒక స్టార్ హీరో సినిమాలో మ‌రో పెద్ద హీరో క్యామియో చేయాలంటే ఎన్నో ఆలోచించి జాగ్ర‌త్త‌గా నిర్ణ‌యాలు తీసుకోవాలి. ఏదో అవ‌కాశం వ‌చ్చింది క‌దా అని ఠ‌క్కున ఓకే చేసేయ‌కూడ‌దు. రిజ‌ల్ట్ లో ఏ మాత్రం తేడా వ‌చ్చినా ఫ్యాన్స్ డిజ‌ప్పాయింట్ అవ‌డం ప‌క్క‌న పెడితే, అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఇమేజ్ మీద కూడా ఆ ఎఫెక్ట్ ప‌డుతుంది. 

అందుకే బాగా ప‌వ‌ర్‌ఫుల్ రోల్ అయితే త‌ప్పించి, తొంద‌ర‌ప‌డకూడదు. బ‌న్నీ ఇలాంటి విష‌యాల్లో ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంటాడు. అప్ప‌ట్లో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో, అనుష్క టైటిల్ రోల్ లో వ‌చ్చిన రుద్ర‌మ‌దేవి సినిమాలో బ‌న్నీ గోన‌గ‌న్నారెడ్డి క్యారెక్ట‌ర్ చేసిన విష‌యం తెలిసిందే. మెయిన్ రోల్ అనుష్క‌దే అయినా, చ‌రిత్ర‌లో గోన‌గ‌న్నారెడ్డి క్యారెక్ట‌ర్‌కు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి ఒప్పుకుని ఆ రోల్ చేసి, స‌క్సెస్‌లో కీల‌క‌పాత్ర పోషించాడు. 

అయితే రీసెంట్‌గా షారుఖ్ న‌టిస్తున్న జవాన్ సినిమాలో ఓ క్యారెక్ట‌ర్ కోసం బ‌న్నీని అడిగిన విష‌యం తెలిసిందే. దానికి బాగా ఆలోచించి బ‌న్నీ ఫైన‌ల్‌గా చేయ‌లేన‌ని సున్నితంగానే తిరస్క‌రించాడ‌ట‌. పుష్ప‌తో ప్యాన్ ఇండియ‌న్ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న బ‌న్నీ, ఆ హెయిర్‌స్టైల్‌ని పుష్ప‌2 లో త‌ప్ప మ‌రో సినిమాలో వాడ‌కూడ‌ద‌ని డిసైడైన‌ట్లు తెలుస్తోంది. కోలీవుడ్ హీరో విజ‌య్ కూడా ఇలాంటి వేరే రీజ‌న్స్‌తో నో చెప్పాడు. ఓ ర‌కంగా వీరు తొంద‌ర‌ప‌డ‌కుండా ఉండ‌టమే మంచిద‌నిపిస్తోంది. 

వీరిద్ద‌రూ రిజెక్ట్ చేసిన స్థానంలోకి సంజ‌య్ ద‌త్ లాకైన‌ట్లు తెలుస్తోంది. సంజ‌య్ ద‌త్ లాంటి ఏజ్డ్ హీరోతో చేయిస్తుంటే ఆ క్యారెక్ట‌ర్ కు బ‌న్నీ నో చెప్ప‌డమే క‌రెక్ట్ అనిపిస్తోంది. అట్లీ డైరెక్ష‌న్‌లో తెరకెక్కుతున్న జ‌వాన్‌లో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, మెయిన్ విల‌న్ గా విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నాడు. జ‌వాన్ ను ద‌స‌రా లేదా దీపావ‌ళికి రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :