ASBL NSL Infratech

న్యూయార్క్‌లో ఘనంగా ఇండియా డే వేడుకలు... గ్రాండ్‌ మార్షల్‌గా హాజరైన అల్లు అర్జున్‌ 

న్యూయార్క్‌లో ఘనంగా ఇండియా డే వేడుకలు... గ్రాండ్‌ మార్షల్‌గా హాజరైన అల్లు అర్జున్‌ 

న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పెరేడ్‌ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు గ్రాండ్‌ మార్షల్‌గా టాలీవుడ్‌, పాన్‌ ఇండియా స్టార్‌ అల్లు అర్జున్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘భారత్‌ కా తిరంగా.. కభీ ఝకేగా నహీ’.. పుష్ప డైలాగ్‌తో అందరినీ అలరించారు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయిన అల్లు అర్జున్‌కి ఈ వేడుక సందర్భంగా అరుదైన గౌరవం లభించింది. 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా న్యూయార్క్‌లోని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఐఎ) నిర్వహించిన భారీ పరేడ్‌కు ఆయన నాయకత్వం వహించారు.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ ఈ ర్యాలీని నిర్వహించింది. దీనికి గ్రాండ్‌ మార్షల్‌గా అల్లు అర్జున్‌ వ్యవహరించారు. ఈ సందర్బంగా ర్యాలీని ఉద్దేశించి అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘యే భారత్‌కా తిరంగా హై.. కబీ ఝకేగా నహీ..తగ్గేదేలే’.. అంటూ పుష్ప డైలాగ్‌తో ఉత్సాహపరిచాడు.

భారతీయుడిగా జన్మించినందుకు గర్వపడుతున్నట్లు తెలిపాడు. ఇక గ్రాండ్‌ మార్షల్‌గా వ్యవహిరించిన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కి న్యూయార్క్‌ మేయర్‌ ఆమమ్స్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ రికగ్నిషన్‌ బహుకరించాడు. ఇండియా పరేడ్‌కి అల్లు అర్జున్‌ రావడంతో న్యూయర్క్‌ వీధులు కిక్కిరిసిపోయాయి. అసోసియేషన్‌ ఛైర్మన్‌ అంకుర్‌ వైద్య సహా వివిధ సంఘాల ప్రతినిధులు సహా పలువురు ప్రవాస భారతీయులు ర్యాలీలో పాల్గొన్నారు.  

దాదాపుగా ఈ పరేడ్‌ కి ఐదు లక్షలు మందికి పైగా భారతీయలు వచ్చి, భారతదేశం పట్ల తమకున్న దేశభక్తిని, అలానే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పై తమ్ముకున్న అభిమానాన్ని చాటుకున్నారు, ఇంత స్థాయిలో ‘న్యూయర్క్‌ డే పరేడ్‌’ కి ప్రవాసులు రావడం ఓ రికార్డుగా ‘ఇండియా డే పరేడ్‌’ ప్రతినిధులు అభివర్ణిస్తున్నారు. అలానే ఈ సందర్శన లో భాగంగా న్యూయార్క్‌ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ను ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మర్యాదపూర్వకంగా కలిశారు, వారి సంభాషణల మధ్యలో అల్లు అర్జున్‌తో కలిసి ఎరిక్‌ ఆడమ్‌, ప్రపంచ వ్యాప్తంగా విశేష జనాధరణ పొందిన ‘పుష్ప’ చిత్రంలోని ‘తగ్గేదేలే’.. డైలాగ్‌ ఫోజ్‌ పెట్టడం విశేషం.  

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :