వి మెగా బ్యానర్ లో ఫస్ట్ సినిమా అతనితోనే!

ఎన్నో అంచనాలతో అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమాలో నటించాడు. ఈ సినిమా తన కెరీర్లోనే పాత్ బ్రేకింగ్ మూవీగా నిలుస్తుందనుకున్నాడు. సినిమా కోసం ఎంతో కష్టపడి బాడీ మేకోవర్ చేశాడు. కానీ ఏజెంట్ కోసం అఖిల్ పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా అయ్యింది. ఏజెంట్ డిజాస్టర్ గా మిగలడంతో బాగా నిరాశ చెందాడు అఖిల్.
అందుకే వెంటనే దుబాయ్ వెళ్లిపోయాడు. అక్కడ నుంచి ఇండియాకు తిరిగొచ్చాక కూడా అఖిల్ ఎక్కడా కనిపించింది లేదు. ఇంత కష్టపడినా ఫ్యాన్స్ కు నచ్చే సినిమా ఇవ్వలేకపోయాననే బాధ అఖిల్ లో చాలా ఉంది. అఖిల్ కెరీర్ స్టార్ట్ చేసి ఏడేళ్లవుతోంది కానీ ఇప్పటికీ సరైన బ్లాక్ బస్టర్ తన ఖాతాలో లేదు. అయితే ఇప్పుడు అఖిల్ కెరీర్ ను నిలబెట్టే బాధ్యతను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
చరణ్, తన ఫ్రెండ్ విక్రమ్‌తో కలిసి మొదలుపెట్టబోయే వి మెగా బ్యానర్ ఫస్ట్ సినిమాగా అఖిల్ మూవీనే ఉండబోతుందట. అఖిల్ పై ఎంతో అఫెక్షన్ ఉన్న చరణే ఈ సారి స్టోరీ సెలెక్షన్, డైరెక్టర్ ని గైడ్ చేయడం లాంటివన్నీ చేయనున్నాడట. సినిమా మొత్తం చరణ్ పర్యవేక్షణలోనే జరగనుందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన అక్కినేని ఫ్యాన్స్ ఈ రూపంలోనైనా అఖిల్ కు బ్రేక్ వస్తే అంతే చాలనుకుంటున్నారు.
ఇప్పటికే యువి క్రియేషన్స్ నిర్మాణంలో వచ్చిన పలు సినిమాలకు పని చేసిన అనిల్ అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. సినిమా ఎప్పటి నుంచి సెట్స్ పైకి వెళ్తుందనేది ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. అఖిల్ కు ఈ సినిమా అయినా మంచి ఫలితాన్నివ్వాలని ఆశిద్దాం.