ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నెల‌లో రిలీజ్.. బ‌జ్ ఏది?

నెల‌లో రిలీజ్.. బ‌జ్ ఏది?

ఎన్ని ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని ఉంద‌న్న‌ట్లు అఖిల్ అక్కినేనికి ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన హిట్ ప‌డ‌లేదు. మొత్తానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ఓ మోస్త‌రు హిట్‌ను అందుకున్న అఖిల్, ఆ త‌ర్వాత మ‌రోసారి త‌న స‌త్తా చూపడానికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. 

ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో అనిల్ సుంక‌ర ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవాల్సింది కానీ రీషూట్ల కార‌ణంగా సినిమా ఇంకా పూర్తి కాలేదు. ఏజెంట్ సినిమా కోసం చాలా పెద్ద మొత్తంలోనే బ‌డ్జెట్ కూడా పెట్టిన‌ట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రిలీజ్ టార్గెట్‌తో వ‌స్తున్న ఏజెంట్ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుంది. 

రీసెంట్‌గా ఈ సినిమా నుంచి మ‌ళ్లీ మ‌ళ్లీ అనే సాంగ్ రిలీజైంది. హిప్ హాప్ మ్యూజిక్‌తో వ‌స్తున్న ఈ సినిమాలోని సాంగ్ కు అనుకున్నంత రేంజ్‌లో రీచ్ రాలేదు. ఈ మ‌ధ్య సినిమా ఎలాంటిదైనా సాంగ్స్‌తోనే హైప్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటిది ఇంత‌టి భారీ బ‌డ్జెట్ సినిమా ఏజెంట్‌లో సాంగ్‌పై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. మిగిలినా పాట‌ల విష‌యంలోనైనా చిత్ర బృందం జాగ్ర‌త్త‌లు తీసుకోవాలంటున్నారు. 

ప్ర‌మోష‌న్స్, సినిమా పాట‌లు ఈ రెండే ఎలాంటి సినిమాకైనా బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నాయి. సినిమా ఎంత బాగున్నా ప్ర‌మోష‌న్స్ చేయ‌క‌పోతే ఆ సినిమాలు హిట్ అయిన దాఖ‌లాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఏజెంట్ సినిమా నుంచి వ‌చ్చిన పాట ఆడియ‌న్స్ ను నిరాశ పరిచింది. ఏజెంట్‌కు  బ‌జ్ కూడా పెద్ద‌గా లేదు. రిలీజ్‌కు ఇంకో నెలే ఉన్న సినిమాకు ఈ పాటికే బ‌జ్ క్రియేట్ అవాల్సింది కానీ ఏజెంట్ టీమ్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌మోష‌న్స్‌పై దృష్టి పెట్ట‌లేదు. ఈ విష‌యంలో అఖిల్ అయినా స్పెష‌ల్ కేర్ తీసుకోవాల‌ని ఫ్యాన్స్ త‌మ అభిప్రాయాల‌ను వెల్లిబుచ్చుతున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :