ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బే ఏరియాలో విజయవంతమైన ఎఐఎ మాయాబజార్‌  

బే ఏరియాలో విజయవంతమైన ఎఐఎ మాయాబజార్‌  

బే ఏరియాలో అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ (ఎఐఎ) ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్వహించిన మాయా బజార్‌-2022 విజయవంతమైంది. ఈ వేడుకకు 10,000 మందికి పైగా ఎన్నారైలు హాజరయ్యారు.  ఈ కార్యక్రమం బే ఏరియా మొత్తం స్వచ్ఛమైన ఆహ్లాదకర సంగీతంతో మార్మోగింది. సిటీ ఆఫ్‌ శాన్‌ రామన్‌ ఈవెంట్‌ పార్టనర్‌, బోలీ 92.3 ఎఫ్‌ఎం ద్వారా సహ-స్పాన్సర్‌ గా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు గ్రాండ్‌ స్పాన్సర్‌ సంజీవ్‌ గుప్తా సిపిఎ, రియల్టర్‌ నాగరాజ్‌ అన్నయ్యలు వ్యవహరించారు.

కార్యక్రమాన్ని రైట్‌ బైట్‌ డెంటల్‌ సమర్పించారు. సిల్వర్‌ స్పాన్సర్‌ గా రాయ్‌ చెట్టి (ఫార్మర్స్‌ ఇన్సూరెన్స్‌). ఐసిఐసిఐ బ్యాంక్‌, ఆజాద్‌ ఫైనాన్షియల్స్‌, మాన్‌ప్రెన్యూర్‌ ఇతర స్పాన్సర్లుగా ఉన్నాయి. పిల్లల కోసం అనేక కార్నివాల్‌ గేమ్‌లు, స్లయిడ్‌లు నిర్వహించారు. జంగిల్‌ బుక్‌ (జిఫ్ఫీ పెంపుడు జంతువులు), డైనోసార్‌ పెట్టింగ్‌ జూ, జంప్‌ హౌస్‌లు పిల్లలతో రన్‌అవే వంటివి హిట్‌గా నిలిచాయి. మాయాబజార్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటివి చిన్నారులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. కూచిపూడి, భరత నాట్యం, కథక్‌ శాస్త్రీయ నృత్యాలు, టాలీవుడ్‌ నృత్యాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. బాటా కరోకే బృందంలోని గాయకులు సూపర్‌ హిట్‌ పాటలను పాడారు. దీనికి తోడు స్టేజ్‌-2లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఇక, ఆహారం విషయానికి వస్తే.. మిర్చి మసాలా, ఫుడ్‌ ఫెస్టివల్‌ విశిష్టమైన ప్రెజెంటేషన్‌తో వివిధ రుచికరమైన వంటకాలను ఇక్కడ అందించారు. నిజానికి వేసవి వస్తే.. షాపింగ్‌ చేయాలని ఉవ్విళ్లూరుతారు. దీనికి మాయాబజార్‌ వేదికగా మారింది. అన్నీ ఒకే చోట ఏర్పాటు చేశారు.  65 మంది విక్రేతలు ఈవెంట్‌ స్పాన్సర్‌లు, దుస్తులు, నగలు,  మెహందీ, రియల్‌ ఎస్టేట్‌, పాఠశాలలు, ఐటీ శిక్షణ, ఆరోగ్య సేవలు, సంగీత పాఠశాలలు, పాఠశాల ‘‘తెలుగు పాఠశాలలో విస్తరించి ఉన్న బూత్‌లను ప్రదర్శించారు. తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా) బోన్‌ మారో డ్రైవ్‌ నిర్వహించింది.

ఈ సందర్భంగా ఎఐఎ బృందం కాన్సుల్‌ జనరల్‌ టీవి నాగేంద్ర ప్రసాద్‌ ని ఘనంగా సత్కరించింది. అసెంబ్లీ సభ్యుడు రెబెక్కా బాయర్‌-కహన్‌, శాన్‌ రామన్‌ మేయర్‌ డేవిడ్‌ హడ్సన్‌, శాన్‌ రామన్‌ వైస్‌ మేయర్‌ శ్రీధర్‌ వెరోస్‌, కౌన్సిల్‌ మెంబర్‌ సబీనా జాఫర్‌, డబ్లిన్‌ సిటీ వైస్‌ మేయర్‌ జీన్‌ జోసీ, కౌన్సిల్‌ సభ్యుడు మైఖేల్‌ మెక్‌కోరిస్టన్‌, మౌంటైన్‌ హౌస్‌ ప్రి హారీ డి. ధిల్లాన్‌, ట్రేసీ సిటీ మేయర్‌ ప్రోటెమ్‌ వెరోనికా వర్గాస్‌, ఎరిక్‌ స్వాల్వెల్‌ కార్యాలయం నుండి జిల్లా డైరెక్టర్‌ సమాజం కోసం ఇంత ఆహ్లాదకరమైన వేసవి ఉత్సవాలను నిర్వహించడం పట్ల ప్రముఖులు ఎఐఎని అభినందించారు. ఈ వేడుక సందర్భంగా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని లాభాపేక్షలేని సంస్థలకు విరాళంగా అందించారు.
 

Click here for Event Gallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :