ASBL NSL Infratech

క్రికెటర్ తో హీరోయిన్ పెళ్లి..షురూ అయిన హడావిడి...!

క్రికెటర్ తో హీరోయిన్ పెళ్లి..షురూ అయిన హడావిడి...!

బాలీవుడ్ హీరోయిన్స్, టీమిండియా క్రికెటర్స్ మధ్య చాలా ప్రేమాయణాలు మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది క్రికెటర్స్ బాలీవుడ్ హీరోయిన్స్ పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. విరాట్ కోహ్లీ కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ పెళ్లి చేసుకున్నారు.  మాజీ క్రికెటర్స్ యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ కూడా బాలీవుడ్ హీరోయిన్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు వీరి  దారిలోనే మరో యంగ్ క్రికెటర్ కూడా నడుస్తున్నాడు.

టీమిండియా బ్యాట్స్ మాన్ గా ఉన్న స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి చాలాకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇపుడు ఇదే హాట్ టాపిక్ అయింది బాలీవుడ్ లో. ఒకప్పటి బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి, రాహుల్ చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమకు వారి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. దీంతో ఈ జంట తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు.

రాహుల్ ఆతియ శెట్టి పెళ్లి ఈ నెలలోనే జరగబోతుంది. ఈ నేపథ్యంలో క్రికెటర్ కేఎల్ రాహుల్ న్యూజిలాండ్ తో జరగబోయే సిరీస్ కి కూడా దూరం ఉన్నారు. రీసెంట్ గా ఈ పెళ్ళికి సంబంధించిన పనులు మొదలైనట్లు తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ లో వీరి పెళ్లి వేడుక జరగబోతుంది. ఈ నేపథ్యంలో అతియా శెట్టి ఇంట్లో ముందస్తు పెళ్లి పనులన్నీ కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అతి కొద్ది మంది మాత్రమే ఈ పెళ్లి వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :