ASBL NSL Infratech

అరుంధ‌తి సినిమా ఆమె చేయాల్సిందట‌

అరుంధ‌తి సినిమా ఆమె చేయాల్సిందట‌

ఇండ‌స్ట్రీలో ఒక‌రు చేయాల్సిన సినిమాలు మ‌రొక‌రు చేయ‌డం, ఆ క్యారెక్ట‌ర్ బాగా క్లిక్ అయ్యాక దాన్ని వ‌దులుకున్నందుకు ఫీల‌వ‌డం చాలా మామూలు విష‌యం. ఫ‌లానా క్యారెక్ట‌ర్ తాము వ‌దులుకున్న‌ట్లు ఆయా ఆర్టిస్టులు చెప్తున్న‌ప్పుడు వాళ్లే ఆ క్యారెక్ట‌ర్ చేసి ఉంటే ఎలా ఉండేద‌ని అంద‌రూ ఊహించుకోవ‌డం స‌హ‌జం. 

తెలుగులో దేవి లాంటి ప‌లు హిట్ సినిమాలు చేసిన క‌న్న‌డ న‌టి ప్రేమ‌, రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో ఇంట్రెస్టింగ్ మ్యాట‌ర్ రివీల్ చేసింది. టాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ అరుంధ‌తి కోసం మొద‌ట త‌న‌నే సంప్ర‌దించిన‌ట్టు చెప్పింది. ప్రేమ‌ను దేవి సినిమాతో టాలీవుడ్‌కి ప‌రిచయం చేసింది కూడా కోడి రామ‌కృష్ణ‌నే. ఆ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది. 

అరుంధ‌తి సినిమాలో జేజ‌మ్మ క్యారెక్ట‌ర్‌కు కూడా ఆయ‌న మొద‌ట త‌న‌నే అడిగార‌ని, కానీ ఆ టైమ్‌లో క‌న్న‌డ‌లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల అరుంధ‌తి కోసం డేట్స్ అడ్జస్ట్ చేయ‌లేక తాను ఆ సినిమాను ఒప్పుకోలేద‌ని ప్రేమ చెప్పింది. అయితే రిలీజ్ త‌ర్వాత అరుంధ‌తి సినిమా చూసినట్లు, ఆ సినిమా త‌న‌కు ఎంత‌గానో న‌చ్చిన‌ట్లు ప్రేమ చెప్పింది. 

సినిమాలో అనుష్క బాగా న‌టించింద‌ని, కొన్ని క్యారెక్ట‌ర్స్ మీద న‌టించే న‌టుల పేర్లు రాసి ఉంటాయ‌ని, అరుంధతి పాత్ర మీద అనుష్క పేరు రాసి ఉంద‌ని ఆమె పేర్కొంది. ప్రేమ మంచి న‌టి అయిన‌ప్ప‌టికీ, అరుంధ‌తి పాత్ర‌లో అనుష్క ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ను మ‌రే హీరోయిన్ అయినా మ్యాచ్ చేయ‌గ‌ల‌రా అంటే డౌటే.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :