అత్యధిక వయసుతో ప్రపంచ రికార్డు

అత్యధిక వయసుతో ప్రపంచ రికార్డు

అత్యధిక కాలం (26 ఏళ్లు) బతికి ఉన్న పిల్లిగా ఆగ్నేయ లండన్‌కు చెందిన ఫ్లోసి ప్రపంచ రికార్డు సృష్టించి గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కింది. 1995లో జన్మించిన ఫ్లోసీని మొదట ఓ మహిళ 10 ఏళ్ల పాటు పెంచుకుంది. ఆమె మరణానంతరం ఆమె సోదరి సంరక్షణలో ఆ పిల్లి 14 ఏళ్ల పాటు ఉంది.  ఆమె తదనంతరం ఆమె కుమారుడి వద్ద ఉంది. ఆయన వ్యక్తిగత కారణాలతో దానిని పిల్లుల సంరక్షణాలయానికి అప్పగించారు. అక్కడ నుంచి వికి గ్రీన్‌ అనే ఓ మహిళ ప్లోసీని చేరదీసి సాకుతున్నారు. ఈ పిల్లికి వినికిడి శక్తి లోపించిందని, కంటి చూపు మందగిస్తోందని, అయినా అది ఎంతో ఆప్వాయంగా, సరదాగా ఉంటుందని ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Tags :