ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఎన్నికలు లేకుండానే... రాజ్యసభకు 11 మంది ఏకగ్రీవం!

ఎన్నికలు లేకుండానే... రాజ్యసభకు 11 మంది ఏకగ్రీవం!

పలు రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 24న ఎన్నికలు జరుగాల్సి ఉంది. బెంగాల్‌లో ఆరు, గుజరాత్‌లో మూడు, గోవాలో ఒక  స్థానానికి నోటిఫికేషన్‌ వెలువడిన విషయం విధితమే. అయితే ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవం కానున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత డెరెక్‌  ఓబ్రెయిన్‌ రాజ్యసభకు ఎన్నికవనున్నారు. ఆయా అభ్యర్థులకు పోటీగా ఎవరు నామినేషన్‌ వేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. నేటితో ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.

గుజరాత్‌ నుంచి జైశంకర్‌తో పాటు బాబు దేశాయ్‌, దేవ్‌సింగ్‌ జాలా పోటీలో ఉన్నారు. బెంగాల్‌ నుంచి డెరెక్‌ ఓబ్రెయిన్‌, డోలా సేన్‌, సుఖేందు శేఖర్‌ రే, సమీరుల్‌ ఇస్లాం, ప్రకాశ్‌ చిక్‌ బరాక్‌, సాకేత్‌ గోఖలే బరిలో ఉండగా, గోవా నుంచి సదానంద్‌ షెట్‌ తనవాడే బరిలో నిలువగా వీరి ఎన్నిక ఏకగ్రీవం కానున్నది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :