ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వందకోట్ల క్లబ్ లో సంక్రాంతి సినిమాలు

వందకోట్ల క్లబ్ లో సంక్రాంతి సినిమాలు

 ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అటు టాలీవుడ్‌, కోలీవుడ్‌లో భారీ నటుల సినిమాలు రిలీజై అభిమానులను సంతోషపెట్టాయి. అదే సమయంలో భారీ సినిమాలను చూసి చాలారోజులైనందుకు అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాల విడుదలకోసం ఎదురు చూశారు. సంక్రాంతి పండగను సినిమా పండగ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఈ పండగ సీజన్‌లో రిలీజైన సినిమాలకు టాక్‌ కాస్త అటు ఇటుగా వచ్చినా సరే కమర్షియల్‌గా సేఫ్‌ అయ్యే చాన్స్‌లు ఎక్కువగా ఉంటాయి. అందుకే బడా స్టార్లు సైతం సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకుని సినిమాలు చేస్తుంటారు. ప్రతీ సంక్రాంతి లాగే ఈ సంక్రాంతికి కూడా నువ్వా..నేనా అనే రేంజ్‌లో పోటీ రసవత్తరంగా సాగింది.

ఈసారి తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేర్‌ వీరయ్య మూవీతో, బాలకృష్ణ వీరసింహారెడ్డి మూవీతో, తమిళంలో అజిత్‌ తునివు, విజయ్‌ వారిసు సినిమాతో వచ్చారు. ఈ రెండు సినిమాలు తమిళంతోపాటు తెలుగులో కూడా రిలీజ్‌ అయి టాలీవుడ్‌లో కూడా సంక్రాంతి బరిలో వచ్చిన సినిమాల లిస్ట్‌లో చేరాయి.  వీరసింహారెడ్డి సినిమాతో బాలకృష్ణ తనదైన శైలిలో అభిమానులను ఆకట్టుకున్నారు. అదే సమయంలో చిరంజీవి మాస్‌ను, క్లాస్‌ను కూడా వాల్తేరు వీరయ్య సినిమాతో ఆకట్టుకున్నారు. కలెక్షన్ల విషయానికి వస్తే తమిళంలో విజయ్‌, అజిత్‌ సినిమాలు వందకోట్ల క్లబ్‌లోకి ఎంటరయ్యాయని చెబుతున్నారు. అదే సమయంలో తెలుగులో కూడా వీరసింహారెడ్డి,  వాల్తేర్‌ వీరయ్య కలెక్షన్లు బాగానే ఉన్నాయని చెబుతున్నారు.   వీరసింహారెడ్డికి కూడా ఫ్యాన్స్‌ నుంచి భారీ స్పందన వచ్చింది. రెగ్యులర్‌ ఆడియన్స్‌ నుంచి మాత్రం ఎవరేజ్‌ టాక్‌ వచ్చింది. వాల్తేర్‌ వీరయ్య సినిమాకు ఫ్యాన్స్‌తోపాటు మాస్‌ నుంచి కూడా మంచి స్పందనే కనిపిస్తోంది. ఇక వారసుడు ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కింది.   తెగింపు మూవీ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. 

ఈ సంక్రాంతి ఫెస్టివల్‌ అయిన తర్వాత లాంగ్‌ రన్‌లో ఎన్ని రోజులు బజ్‌ ని కొనసాగిస్తూ కలెక్షన్స్‌ రాబడుతుంది అనేది మూవీ ఏ రేంజ్‌ హిట్‌ అనేది తెలుస్తుంది. అయితే ప్రస్తుతం సినిమాలకి వస్తున్న ప్రేక్షకాదరణ చూస్తుంటే ఈ   సినిమాలు వంద కోట్ల గ్రాస్‌ క్లబ్‌లో చేరడం అయితే పక్కా అనే మాట వినిపిస్తుంది. అయితే ఈ హీరోల గత సినిమాలని బీట్‌ చేసే విధంగా కలెక్షన్స్‌ సాధిస్తుందా లేదా అనేది చూడాలి. ‘వారసుడు’ కూడా పండక్కి హిట్టు కొట్టలేకపోయాడు. తమిళంలో పర్వాలేదనిపించిన, తెలుగులో మాత్రం డివైడ్‌ టాక్‌ వచ్చింది. అయితే కొందరు మాత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని అంటున్నారు. కథ పాతదే అయినా కథనం బాగుందని, ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా పండక్కి ఎంజాయ్‌ చెయ్యొచ్చన్ని వెల్లడిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు రిలీజైన ‘కళ్యాణం కమనీయం’ డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. ప్రతీ సంక్రాంతికి ఒక చిన్న సినిమా రిలీజై మంచి విజయం సాధిస్తుండటం గత కొన్నేళ్లుగా ఆనవాయితిగా వస్తుంది. అయితే ఈ సారి మాత్రం అలా జరుగలేదు. అసలు ఎలాంటి హైప్‌ లేకుండా విడుదలైన కళ్యాణం కమనీయం సినిమాకు పాజిటీవ్‌ టాక్‌ రాలేకపోవడంతో ఆ సినిమా విషయం ప్రస్తావించకపోవడమే మంచిదని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ సంక్రాంతి సినీ అభిమానులకు హిట్‌ లేని సంక్రాంతి అని చెప్పవచ్చు. బ్లాక్‌బస్టర్‌ హిట్టు అనే మాట పక్కన పెడితే కానీసం హిట్‌ అనే టాక్‌ కూడా ఏ ఒక్క సినిమాకు రాలేదు. అయితే వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు టాక్‌తో సంబంధంలేకుండా మెజారిటీ ఆడియోన్స్‌ వస్తున్నారు. ఈ రెండు సంక్రాంతికి సేఫ్‌ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక వారసుడు కూడా ఫ్యామిలీ ఆడియెన్స్‌ హెల్ప్‌తో సేఫ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరీ ఈ సంక్రాంతికి ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

అమెరికా అభిమానుల సంబరాలు

అమెరికాలో అగ్రహీరోల సినిమా సక్సెస్‌ అయితే నాన్‌ బాహుబలి రికార్డులను అందుకోవడానికి ఛాన్సుంటుంది. అయితే ఈ సంక్రాంతి బరిలో విడుదలైన వీరసింహారెడ్డి- వాల్తేరు వీరయ్య వసూళ్లు ఫర్వాలేదనే టాక్‌ వినిపిస్తోంది.  ఓవర్సీస్‌ మార్కెట్లో ఇరువురు మాస్‌ సీనియర్‌ హీరోలకు మార్కెట్‌ రేంజ్‌ సోసోగానే ఉంది. మహేష్‌ -పవన్‌- ప్రభాస్‌- తారక్‌ లాంటి హీరోలకు అమెరికాలో పెద్ద మార్కెట్‌ ఉందన్న విషయం తెలిసిందే. మొత్తానికి సంక్రాంతి సినిమాలన్నీ థియేటర్లలోకి దిగేశాయి. ఈసారి ఏకంగా ఐదు చిత్రాలు నాలుగు రోజుల వ్యవధిలో విడుదల కావడం విశేషం. అందులో రెండు డబ్బింగ్‌ బొమ్మలు కాగా.. మూడు తెలుగు సినిమాలు. పేరుకు ఐదు సినిమాలు బరిలో దిగినా.. ప్రధానంగా అందరి దృష్టీ నిలిచింది మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల సినిమాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ల మీదే. సంక్రాంతి విజేత ఈ రెండు చిత్రాల్లో ఒకటే అవుతుందని అందరూ అంచనా వేశారు. కాగా అమెరికాలో తమ అభిమానుల హీరోల సినిమాలకు ఫ్యాన్స్‌ చేసిన హడావుడి మాత్రం అందరి దృష్టిలో పడేలా చేసింది. యుఎస్‌లో బాలకృష్ణకు ఉన్నఫాలోయింగ్‌ కారణంగా వీరసింహారెడ్డి చిత్రానికి మంచి ఓపెనింగ్స్‌ కనిపించాయి. దానికితోడు బాలకృష్ణ అభిమానులు చేసిన హంగామా ఈ చిత్రానికి మంచి పబ్లిసిటీని మాత్రం తెచ్చిపెట్టింది. దీంతో యూఎస్‌ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అలాగే చిరంజీవి అభిమానులు కూడా వాల్తేరు వీరయ్య సినిమా విడుదలను పురస్కరించుకుని చేసిన హంగామా కూడా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్‌ బాగానే వచ్చాయి. మంచి టాక్‌ రావడంతో ఈ చిత్రం కలెక్షన్లు కూడా భారీగానే పెరిగిందని చెబుతున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :