ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

చేనేతలను ఉద్దేశించి ప్రసంగించిన వైయస్ జగన్

చేనేతలను ఉద్దేశించి ప్రసంగించిన వైయస్ జగన్

చంద్రబాబు హయాంలో ప్రతి సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని శ్రీ వైయ‌స్‌ జగన్‌ అన్నారు. నష్టపోయిన వారికి భరోసా ఇచ్చేందుకే తాను పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. అంద‌రికీ అండ‌గా ఉంటాన‌ని జ‌న‌నేత శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా చేనేతలను ఉద్దేశించి శ్రీ వైయస్ జగన్ ప్రసంగించారు. ప్రసంగంలోని.. ముఖ్యాంశాలు...

  1. చేనేత కార్మికులను ఆదుకుంటాం.
  2. తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తాం.
  3. నూలుపై సబ్సిడీ చెల్లిస్తాం
  4. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బిసి,మైనార్టీ (బడుగు బలహీన వర్గాల ) పేదలందరికీ 45 ఏళ్లకే పింఛన్లు
  5. ఫింఛన్‌ వెయ్యి నుంచి రూ.2 వేలు పెంచుతా
  6. ఎన్నికల సమయంలో రైతులను, చదువుకుంటున్న పిల్లలను మోసం చేశాడని, అవ్వ, తాతలను, చేనేతలను వదిలిపెట్టలేదని చంద్రబాబు మోసాలను ఎండగట్టారు.
  7. చేనేత కుటుంబాలకు అతి తక్కువ వడ్డికే రుణాలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఇవాళ చేనేత కుటుంబాలకు రుణాలు అందడం లేదన్నారు.
  8. చేనేతలకు ప్రతి జిల్లాలో చేనేత పార్కు ఏర్పాటు చేస్తానని చెప్పినట్లు గుర్తు చేశారు. ఏ జిల్లాలో కూడా చేనేత పార్కు కనిపించలేదన్నారు.
  9. చంద్రబాబు పుణ్యమా అని చేనేతలు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో చేనేతల ఆత్మహత్యలు పెరిగాయి.
  10. ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయని, బట్టలకు మాత్రం ధర లేదని తెలిపారు. ఇంత దారుణంగా పరిస్థితి ఉన్నా పట్టించుకునే నాథుడు లేడన్నారు.
  11. అన్ని వర్గాలకు అండ‌గా ఉంటా. అందుకే 45 ఏళ్లకే పింఛను.
  12. ఆరోగ్యశ్రీని పునరుద్ధిస్తాం. హైదరాబాద్ లోనూ ఆరోగ్యశ్రీ అమలు చేస్తాం.
  13. పేదవాళ్లకు ఇళ్లు కట్టి మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించటంతో పాటు వారికి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు అందజేస్తాం.
  14. పిల్లలు చదువుకుంటేనే బతుకులు మారుతాయి. విద్యార్థులు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తాం. ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు ప్రతి ఏటా 20వేలు మెస్ ఛార్జీలు చెల్లిస్తాం.
  15. చేనేతల అభివ)ద్ధికి వైయస్ఆర్ ఎంతో చేశారు. వారి సమస్యలపై వైయస్ఆర్ వెంటనే స్పందించేవారు. 4ఏళ్ల చంద్రబాబు పాలనలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా? 
  16. ప్రజలు కొడతారన్న భయంతో టీడీపీ వెబ్ సైట్ నుంచి మేనిఫెస్టోను తీసేశారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో అందరినీ మోసం చేశారు.
  17. చేనేత కార్మికుల బ్యాంకు లోన్లు మాఫీ చేయలేదు.
  18. బడ్జెట్ లో ప్రతి ఏటా వెయ్యికోట్లు అన్నారు.ఇచ్చారా?
  19. ఇళ్లు కట్టిస్తామన్నారు. కట్టించారా?

చేనేత కార్మికులకు  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా చేనేతలతో ముఖాముఖి నిర్వహించారు. వారి స‌మ‌స్యలు ఓపిక‌గా విన్న శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మీరు  సూచించిన అంశాలను నెరవేరుస్తామన్నారు. త్వరలో బీసీ గర్జన నిర్వహించిన అన్ని బీసీ కులాల సమస్యలను మ్యానిఫెస్టోలో చేరుస్తామని జగన్ ప్రకటించారు.

తమ సమస్యలను శ్రీ జగన్ గారితో మెరపెట్టుకున్న చేనేతలు. ఈ సదస్సుకు హాజరైన ప్రజానీకం తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా అందరి సమస్యలను సావధానంగా విన్న శ్రీ వైయస్ జగన్.  ప్రజల సమస్యలు వేగవంతంగా పరిష్కారం కావటానికి గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తామని శ్రీ జగన్ ప్రకటించారు. అందులో ఆ గ్రామంలో చదువుకున్న10 మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తాం. గ్రామ సచివాలయం ద్వారా పింఛను, ఇతర ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటివి పార్టీలకతీతంగా 72 గంటల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగింది.

Click here for Photogallery

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :