ASBL NSL Infratech

జనవరి 9న ముగియనున్న పాదయాత్ర

జనవరి 9న ముగియనున్న పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఈ నెల 9న ముగియనుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 2017 నవంబర్‌ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పూర్తికానుందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 134 నియోజకవర్గాల్లో 120 బహిరంగ సభలు, రెండువేలకుపైగా గ్రామాలు, 3500 కి.మీ.పైగా పాదయాత్ర సాగిందని తెలిపారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019 జనవరి 9వ తేదీ ఎంతో చారిత్రాత్మక రోజు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఆ రోజు ముగియనుంది. పాదయాత్రకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 2 నుంచి సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించి పాదయాత్ర లక్ష్యాలను నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రజలకు వివరిస్తారు.

వైఎస్‌ఆర్‌ చనిపోయిన తరువాత జగన్‌ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గడిచిన ఐదేళ్లల్లో ఊహించని సమస్యలు, అక్రమ కేసులు, జైలు జీవితం, హత్యాయత్నం వరకు ఎన్నో కష్టాలను చవిచూశారు. రాష్ట్ర విభజన తర్వాత మానవ తప్పిదాలు, అసమర్థత కారణంగా రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయింది. 2019 ఎంతో కీలకమైనది. అవినీతి పరుల పాలనకు చరమగీతం పాడి వైఎస్‌ జగన్‌ రాష్ట్రానికి సీఎం కానున్నారు అని అన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :