ASBL NSL Infratech

త్వరలో నటుడు విశాల్ పెళ్లి ?

త్వరలో నటుడు విశాల్ పెళ్లి ?

సినీ నటుడు, నడిగర్‌ సంఘం అధ్యక్షుడు విశాల్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారట. ఈ విషయాన్ని ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత జీకే రెడ్డి కోలీవుడ్‌ మీడియా వర్గాలతో చెప్పినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన అనీశా అనే ఓ వ్యాపారవేత్త కుమార్తెతో విశాల్‌ వివాహం జరగబోతున్నట్లు పేర్కొన్నారు. త్వరలో హైదరాబాద్‌లో నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నారట. పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. కాబట్టి ప్రస్తుతానికి నిశ్చితార్థ పనులు మొదలుపెట్టే పనిలో ఆయన కుటుంబీకులు ఉన్నట్లు కోవీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే నడిగర్‌ సంఘం కోసం కొత్త భవనాన్ని నిర్మించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని గతంలో విశాల్‌ శపథం చేశారట.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :