ASBL NSL Infratech

48 మంది బాధితులకు విముక్తి...వైఎస్‌ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం

48 మంది బాధితులకు విముక్తి...వైఎస్‌ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం

మలేషియాలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన 48 మంది బాధితులను వైఎస్‌ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కన్వీనర్‌, తూర్పుగోదావరి జిల్లా మగటపల్లి గ్రామానికి చెందిన బొలిశెట్టి శ్రీరామ్‌ పర్యవేక్షణలో వారి స్వగ్రామాలకు పంపించారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి, వీసా లేక తిరిగి స్వదేశం వచ్చే అవకాశం లేక ఎంతోమంది కార్మికులు మలేషియాలో దిక్కుతోచని స్థితిలో మగ్గిపోతున్నారు. వారిని గుర్తించి ఏపీ ఎన్‌ఆర్‌టీ మలేషియా విభాగం ఆధ్వర్యాన ఇండియన్‌ ఎంబసీ సహకారంతో స్వదేశానికి పంపించే ఏర్పాటు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ సహకారంతో మలేషియాలో చిక్కుకున్న వారిని స్వరాష్ట్రం పంపిస్తున్నామని శ్రీరామ్‌ తెలిపారు. ఆమ్మెస్ట్రీ (క్షమాభిక్ష)ని ఉపయోగించుకుని మలేషియాలో చిక్కుకున్న వారిని రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 1న మలేషియాలో ఆమ్మెస్ట్రీ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇంతవరకూ మన రాష్ట్రానికి చెందిన 150 మందిని పంపించామని పేర్కొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :