డొనాల్డ్ ట్రంప్ సర్కారు బెదిరింపు
క్యూబాతో కుదుర్చుకున్న బేస్వాల్ ఒప్పందాన్ని రద్దు చేస్తామని అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కారు క్యూబాను బెదిరించింది. అమెరికాకు చెందిన మేజర్లీగ్ బేస్బాల్ (ఎంఎల్బి)లో క్యూబస్ క్రీడాకారులను అనుమతించే ఈ ఒప్పందంపై తాము వీటో చేస్తామని ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ మార్కో రూబీ చెప్పారు. గతంలో ఒబామా హయాంలో ఈ ఒప్పందంపై ఇరుదేశాలూ సంతకాలు చేసిన విషయం తెలిసిందే. క్యూబా ప్రభుత్వం ఆ దేశ బేస్బాల్ జట్టును నియంత్రిస్తున్నందున ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని రూబియో విదేశాంగమంత్రి మైక్ పాంపియోకు సూచించారు.
Tags :