ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తన పెళ్లి డేట్ ప్రకటించిన ఫేమస్ సింగర్...

తన పెళ్లి డేట్ ప్రకటించిన ఫేమస్ సింగర్...

ప్రముఖ సింగర్‍, డబ్బింగ్‍ ఆర్టిస్ట్ సునీత కొద్ది రోజుల క్రితం తన రెండో పెళ్లికి సంబంధించి ఆఫీషియల్‍ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. డిజిటల్‍ మీడియా పర్సన్‍ రామ్‍ వీరపనేని తను వివాహం చేసుకోబోతున్నానని సోషల్‍ మీడియా ద్వారా పేర్కొంది. ఎలాంటి సందడి లేకుండానే కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్ధం జరుపుకున్న సునీత తన వివాహాన్ని కూడా కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోనున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్‍లో పెళ్లి చేసుకోవాని ఈ జంట భావించినప్పటికీ ఇద్దరి జాతకాల ప్రకారం సరైన ముహూర్తాలు లేకపోవడంతో జనవరి 9న సునీత్‍, రామ్‍లు ఏడడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 10 నెలల అనంతరం స్వామి వారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, జనవరి 9న తమ వివాహం జరగనుందని పేర్కొంది. తనకు మంచి జీవితాన్ని అందించాలని స్వామి వారిని కోరుకున్నట్టు మీడియాకు తెలిపారు. 19 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న సునీత కొద్ది రోజులకే తన భర్తకు విడాకులు ఇచ్చి అప్పటి నుంచి పిల్లలతో కలిసి సపరేట్‍గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే సునీత, రామ్‍ వీరపనేని రీసెంట్‍గా ప్రీ వెడ్డింగ్‍ వేడుకలు ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :