ASBL NSL Infratech

డొనాల్డ్‌ ట్రంప్‌, పుతిన్‌ చర్చలు

డొనాల్డ్‌ ట్రంప్‌, పుతిన్‌ చర్చలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో టెలిఫోన్‌లో సంభాషించుకున్నారు. ఆయుధ నియంత్రణ, ద్వైపాక్షిక సంబంధాలు తదితర అంశాలపై వీరిరువురు నేతలు చర్చించుకున్నట్లు వైఎస్‌ వర్గాలు తెలిపాయి. అయితే ఈ చర్చల వివరాలు వెల్లడించడానికి నిరాకరించింది. రష్యాపై దాడికి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన కుట్రను భగ్నం చేసినట్లు మాత్రం ఆది వెల్లడించింది. పుతిన్‌, ట్రంప్‌కు ఫోన్‌ చేసి ఇరు దేశాల సంబంధాల గురించి చర్చించారని వైట్‌హౌస్‌ తెలిపింది. అయితే ఫోన్‌ చేయడానికి కారణమేమిటన్నది ఇరు వర్గాలు తెలపడానికి ఇష్టపడలేదు.

రష్యాలో సెలవు రోజున ఉగ్రవాద దాడికి కుట్ర జరుగుతున్నట్లు అమెరికా సమాచారం ఇచ్చినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు పుతిన్‌ ఫోన్‌ చేశారని వైట్‌హౌస్‌ ప్రతినిధి హోగన్‌ గిడ్లీ అన్నారు. అమెరికా, రష్యా మధ్య సంబంధాలను పెంపొందించుకునేందుకు రెండు దేశాల అధ్యక్షులు చర్చించినట్లు ఆయన చెప్పారు. నూతన అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం కుదుర్చుకోవాలన్న తన ఆకాంక్షను ట్రంప్‌ పుతిన్‌కు తెలియజేశారని వైట్‌హౌస్‌ ప్రతినిధి తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :