ASBL NSL Infratech

ఉమ్మడి దేవిశ్రీ ప్రసాద్‌కు ఎన్నారైల చేయూత

ఉమ్మడి దేవిశ్రీ ప్రసాద్‌కు ఎన్నారైల చేయూత

చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ఉమ్మడి దేవిశ్రీ ప్రసాద్‌కు ఎన్నారైలు అండగా నిలిచారు. ఖతార్‌లో ఉంటున్న నందికోళ్ల బాబా ప్రసాద్‌ తమ మిత్రుల ద్వారా రూ.1.60 లక్షలు సేకరించారు. విశాఖలో ఉంటున్న తన మిత్రులు ఖలీల్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో వియ్‌ కేర్‌ ఫర్‌ యూ ద్వారా మరో రూ.50 వేలు సేకరించారు. ఈ మొత్తం రూ.2.10 లక్షలను చెక్కు రూపంలో కాకినాడలో ఉన్న దేవిశ్రీప్రసాద్‌ తండ్రి చంద్రశేఖర్‌కు అందజేశారు. తమ చిన్నారి చికిత్సకు అండగా నిలిచి ఆర్థికసహాయం అందించిన దాతలకు దేవిశ్రీప్రసాద్‌ తల్లిదండ్రులు చంద్రశేఖర్‌, నీరజ కృతజ్ఞతలు తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :