ASBL NSL Infratech

జిల్లాల్లో ఐటీహబ్స్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి

జిల్లాల్లో ఐటీహబ్స్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి

హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి కేంద్రంగా మారినట్లుగానే తెలంగాణలోని అన్నీ జిల్లాల్లో కూడా ఐటీ రంగాన్ని విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టింది.  హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ మొదలైనప్పటి నుంచి దేశీయ సంస్థలతోపాటు విదేశీయ సంస్థలన్నీ నగరం చుట్టే కేంద్రీకరించడం వల్ల హైదరాబాద్‌లో ఐటీ ఉపాధికోసం వచ్చినవారితో నిండిపోతోంది. ఇలా కాకుండా ఐటీ సంస్థలను జిల్లాల్లో కూడా ఏర్పాటు చేస్తే జిల్లా అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు కూడా అక్కడ మెరుగుపడుతాయన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం జిల్లాల్లో ఐటీ రంగం విస్తరణకు నడుంబిగించింది.   కర్ణాటక ప్రభుత్వం కూడా కొత్తగా వచ్చే ఐటీ సంస్థలను బెంగళూరులో కాదని మైసూరుకు తరలిస్తోంది. అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా ఎల్‌కాట్‌ పేరుతో కారిడార్‌ను అభివద్ధి చేసి ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ సంస్థల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. అదే రీతిలో తెలంగాణ ప్రభుత్వం కూడా జిల్లాల్లో ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

తెలంగాణ రూరల్‌ టెక్నాలజీ సెంటర్స్‌ పాలసీని రూపొందించి జిల్లాల్లో కూడా ఐటీ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. దీంతో సియాంట్‌ లిమిటెడ్‌, ఎక్లాస్ట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌ సంస్థలు వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాయి. అలాగే ఖమ్మంలో ఐటీ ఇంక్యుబేషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించడంతో ఏడు కంపెనీలు ముందుకువచ్చి తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి. కరీంనగర్‌లో కూడా ఐటీ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డల్లాస్‌కు చెందిన వెంటోయిస్‌ సాఫ్ట్‌వేర్‌, కాకతీయ ఐటీ సొల్యూషన్స్‌ వరంగల్‌ ఇంక్యుబేషన్‌ టవర్‌లో సాఫ్ట్‌వేర్‌ సర్వీసుల కార్యకలాపాలు ప్రారంభించాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ సంస్థలు ఏర్పాటు చేస్తే వారికి అవసరమైన నైపుణ్యంలో శిక్షణ ఇచ్చేందుకు నాస్కామ్‌ కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అకాడమి ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) ఏర్పాటు చేసి రాష్ట్రంలోని 527 ఇంజనీరింగ్‌ ఇతర డిగ్రీ కాలేజీలతో అనుసంధానమైంది.

ఇప్పటికే 60 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన టాస్క్‌ ఐటీ రంగానికి అవసరమైన మేరకు సాఫ్ట్‌వేర్‌ సర్వీసుల్లోనూ శిక్షణ ఇచ్చేందుకు తన సేవలను విస్తరించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఐటీ శాఖ చొరవ తీసుకోవడంతో కంపెనీలు కూడా ఇంజనీరింగ్‌ కాలేజీలతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చాయి. ద్వితీయశ్రేణి నగరాల్లో హాస్పిటల్స్‌, ఉన్నత ప్రమాణాలతో కూడిన పాఠశాలలు, హోటల్స్‌, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తే ఐటీ నిపుణులు జిల్లాల్లో పని చేసేందుకు ఆసక్తి కనబరుస్తారని ఐటీ దిగ్గజ సంస్థలు ప్రభుత్వానికి వివరించాయి.

ఈ దిశలో ప్రభుత్వం కూడా పని చేస్తూ హాస్పిటల్స్‌ ఏర్పాటుకు కషి చేస్తుండగా అనేక ప్రైవేటు విద్యాసంస్థలు కూడా తమ కేంద్రాలను జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. జిల్లాల్లో ఏర్పాటు చేసే ఐటీ సంస్థలకు విద్యుత్‌ రాయితీలు, ఇంటర్నెట్‌ కనెక్షన్‌లో సబ్సిడీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రాల తరువాత పట్టణాల్లో ఏర్పాటు చేసే సంస్థలకు మరిన్ని రాయితీలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ద్వితీయశ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, నిపుణులకు శిక్షణ ఇవ్వడం, ఇతర రాయితీలు కల్పించేందుకు ప్రభుత్వం ద ష్టి సారించి పెట్టుబడులను ఆకర్షిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో మరింత ఉపాధి కల్పించేందుకు అనేక కార్యకలాపాలు చేపట్టేందుకు ఐటీతోపాటు పారిశ్రామిక శాఖ కూడా క షి చేస్తున్నాయి. ఇలా ఐటీరంగాన్ని ఒకే చోట కేంద్రీకరించకుండా జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం వల్ల అన్నీ చోట్లా అభివృద్ధి జరిగి  దానిద్వారా ఆదాయం కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :