ASBL NSL Infratech

బాలికలు, మహిళల భద్రత - అభయ ప్రాజెక్ట్ పోస్టర్ విడుదల

బాలికలు, మహిళల భద్రత - అభయ ప్రాజెక్ట్ పోస్టర్ విడుదల

బాలికలు, మహిళల భద్రత - అభయ ప్రాజెక్ట్ పోస్టర్ ను విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ప్రజా రవాణా వాహనాలలో ప్రయాణించే బాలికలకు, మహిళలకు భద్రత కలిగించే ఉద్దేశ్యంతో రవాణా శాఖ (ఐఓటి) అంతర్జాల పరిజ్ఞానాన్ని వినియోగించి భద్రత కలిగించే 'అభయ ప్రాజెక్ట్' కు సంబంధించిన పోస్టర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఆవిష్కరించారు.

ప్రజా రవాణా వాహనాలలో ప్రయాణించనున్న బాలికలను,మహిళలను అభయ ప్రాజెక్ట్ ద్వారా ఎలా రక్షించగలమో తెలిపే డివైస్ పని తీరును రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.49 లక్షల ప్యాసింజర్ వాహనాలు ఉన్నాయి. వీటిలో రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్ష వాహనాలలో అభయ ప్రాజెక్ట్ డివైస్ ను ముందుగా అమర్చడం జరుగుతుందని కమిషనర్ బాలబ్రహ్మణ్యం ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ డెమోను విజయవాడ, విశాఖపట్నం నగరాలలో నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ముఖ్యమంత్రికి వివరించారు. సర్వీస్ ప్రొవైడర్ ను జనవరి 10 వ తేదీ లోపు ఎంపిక చేయడం జరుగనుందన్నారు. ఆటో ప్రయాణిస్తున్న సమయంలో బాలికలు, మహిళలు తమ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆటోలో బయట ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ నుస్కాన్ చేసుకోవాలని, తద్వారా వాహనాల, డ్రైవర్ వివరాలు పరిశీలించుకోవచ్చునని కమిషనర్ అన్నారు. బాలికలు, మహిళలు ఆటో ఎక్కిన తరువాత తాము చేరవలసిన గమ్యస్థానమును తమ మొబైల్ అప్లికేషన్ ద్వారా టైప్ చేయాలని మొబైల్ యాప్ వినియోగించుకునే వివరాలను కమిషనర్ తెలియజేశారు. సిస్టంలో గమ్యస్థాననికి చేరుకోవడానికి 3 రూట్లు చూపబడతాయి. డ్రైవర్ ఈ మూడు రూట్లలో కాకుండా డీవియేట్ అయినా లేదా రహదారి లేని ప్రాంతాలకు వాహనం వెళుతున్న సిస్టమ్ సంకేతాలు పంపుతుంది. ఈ సంకేతాల ఆధారంగా బాలికలు, మహిళలు ఐఓటి బాక్స్ పైన ఉన్న ప్యానిక్ బటన్ ని కానీ మొబైల్ ఫోన్ హార్డ్ ప్రెస్ చేయడం ద్వారా ప్రమాద సంకేతాలను పోలీస్ కంట్రోల్ రూమ్ కు పంపడం జరుగుతుందని కమిషనర్ వివరించారు. ఈ ప్రమాద సంకేతాలు అందగానే పోలీస్ కంట్రోల్ రూమ్ వారు..రిమోట్ తో ఇంజిన్ ఎగ్నిషన్ ను ఆపి వాహనాన్ని రిమోట్ తో నిలిపివేసి దగ్గరలో ఉన్న పెట్రోలింగ్ పోలీస్ కు సమాచారాన్ని చేర వేస్తారు. పోలీసులు వచ్చే లోపు బాలికలు లేదా మహిళలు ప్యానిక్ బటన్ ప్రీ రికార్డెడ్ మెసేజ్ ద్వారా చుట్టు ప్రక్కల వారి సహాయాన్ని పొందే సౌలభ్యం ఉంది. తద్వారా అపాయం నుండి రక్షింపబడతారని కమిషనర్ ముఖ్యమంత్రికి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, హోంశాఖ సెక్రటరీ ఏ.ఆర్ అనురాధ, ఉన్నతాధికారి హెచ్. అరుణ్ కుమార్ రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :