ASBL NSL Infratech

నాగచైతన్య, సమంత చిత్రానికి టైటిల్ ఖరారు

నాగచైతన్య, సమంత చిత్రానికి టైటిల్ ఖరారు

నాగచైనత్య, సమంత జంటగా షైన్‌ స్క్రీన్‌ పతాకంపై ఓ చిత్రం తెరక్కెక్కుతున్నది. శివ నిర్వాణ దర్శకుడు. ఈ చిత్రానికి మజిలీ అనే పేరును ఖరారు చేశారు. దేర్‌ ఈజ్‌ లవ్‌ దేర్‌ ఈజ్‌ పెయిన్‌ ఉపశీర్షిక. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఇందులో నాగచైతన్య, సమంత భావోద్వేగభరితంగా కనిపించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ వైజాగ్‌ నేపథ్యంలో సాగే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఓ జంట జీవితంలో ప్రేమ, బాధను హృద్యంగా ఆవిష్కరిస్తూ తెరకెక్కిస్తున్నాం. పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత తొలిసారిగా జంటగా నటిస్తున్న సినిమా ఇది. వారి పాత్రలు, కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. నిన్నుకోరి తర్వాత భావోద్వేగ ప్రేమకథతో దర్శకుడు శివనిర్వాణ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్‌ మరో నాయికగా నటిస్తున్నది అని తెలిపారు.

రావు రమేష్‌, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపిసుందర్‌, సినిమాటోగ్రఫీ: విష్ణువర్మ, ఆర్ట్‌ డైరెక్టర్‌: సాహి సురేష్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :