ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కొత్తలుక్‌ తో మెగాస్టార్‌

కొత్తలుక్‌ తో మెగాస్టార్‌

మెగాస్టార్‌ చిరంజీవి మరికొద్ది గంటల్లో మేకప్‌తో కెమెరా ముందుకు రానున్నారు. ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఆయనపై కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం దర్శకుడు కొరటాల శివ సిద్ధం అవుతున్నారు. సైరా తర్వాత చిరంజీవి నటిస్తున్న చిత్రమిది. అక్టోబర్‌ నెలలో సినిమాకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. సంఖ్యాపరంగా ఇది చిరంజీవి 152వ సినిమా. రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఎప్పుడనే దానిపై రకరకాల తేదీలు వినిపించాయి. తాజాగా కొత్త సంవత్సరం జవనరి 2న మొదలవుతుందని తెలిసింది. హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ సినిమా కోసం చిరంజీవి తన లుక్స్‌ మార్చుకున్నారు. కొత్తలుక్‌తో అదరగొడతారని అభిమానులు నమ్ముతున్నారు. కొరటాల శివ అంటే సామాజిక నేపథ్యం ఉంటుందని ఆశించవచ్చు. ఈ తరహా సినిమాలు చేసేందుకు చిరంజీవి సైతం ఆసక్తి చూపుతుంటారు. అలాగే కొంత విరామం తర్వాత మణిశర్మ చిరు సినిమాకు స్వరాలు అందించనున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :