ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కాలిఫోర్నియాలో కరోనా వేరియంట్ రెండో కేసు నమోదు..

కాలిఫోర్నియాలో కరోనా వేరియంట్ రెండో కేసు నమోదు..

బ్రిటన్‍లో వెలుగుచూసిన కరోనా వైరస్‍ వేరియంట్‍ కొత్త కేసులు ఇప్పుడు అమెరికాలో కూడా బయటపడుతున్నాయి. కాలిఫోర్నియా నగరంలో రెండో కేసు నమోదైంది. ఈ విషయాన్ని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. నేషనల్‍ ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్‍ అలెర్జీ అండ్‍ ఇన్ఫెక్షియస్‍ డిసీజెస్‍ హెడ్‍ డాక్టర్‍ ఆంథోనీ ఫౌసీతో ఆన్‍లైన్‍ సంభాషణలో దక్షిణ కాలిఫోర్నియాలో దొరికిన ఇన్‍ఫెక్షన్‍ను ప్రభుత్వం ప్రకటించింది. కాలిఫోర్నియా ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. అయితే, వేరియంట్‍ సోకిన వ్యక్తికి సంబంధించిన సమాచారమేదీ అధికారులు ప్రకటించలేదు. అమెరికాలో కరోనా వేరియంట్‍ తొలి కేసు కొలరాడోలో బయటపడింది. 24 గంటల తర్వాత కాలిఫోర్నియాలో నమోదైనట్లు ప్రకటన వచ్చింది. తొలి కేసుగా నమోదైన వ్యక్తిని కొలరాడో నేషనల్‍ గార్డస్మన్‍గా గుర్తించారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :