ASBL NSL Infratech

ఎన్టీఆర్ బయోపిక్ లో అల్లురి సీతారామరాజు లుక్ విడుదల

ఎన్టీఆర్ బయోపిక్ లో అల్లురి సీతారామరాజు లుక్ విడుదల

నందమూరి బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఎన్టీఆర్‌ బయోపిక్‌. క్రిష్‌ జాగర్లమూడి దర్వకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రోజు రోజుకి అంచనాలను పెంచేస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ వివిధ గెటప్‌లలో కనిపించనున్నారు. ముఖ్యంగా అల్లూరి సీతా రామరాజుగా బాలకృష్ణ అద్భుతంగా వున్నాడని టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే రీలిజ్‌ అయిన ఈ చిత్రం టీజర్‌కి సోషల్‌ మీడియాలో అత్యధిక వ్యూస్‌ లభిస్తోంది. ఈ చిత్రంపై అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొని వున్నాయి. అందరి అంచనాలకు తగ్గట్లుగా  ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్రాన్ని తెరెక్కించారు.

మొదటి భాగం ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రాన్ని జనవరి 9న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయనున్నారు. స్వరవాణి కీరవాణి మ్యూజిక్‌ ఈ చిత్రానికి బిగ్‌ ఎస్సెట్‌ కానుంది. విద్యాబాలన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నిత్యామీనన్‌న నటించిన ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి, యం.ఆర్‌.వి ప్రసాద్‌ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :