ASBL NSL Infratech

నాలుగేళ్లలో రూ.2,409 కోట్లు, అందజేసి చంద్రన్న బీమా

నాలుగేళ్లలో రూ.2,409 కోట్లు, అందజేసి చంద్రన్న బీమా

నాలుగేళ్లలో రూ.2,409 కోట్లు, అందజేసి చంద్రన్న బీమా పరిహారం
కొత్తగా 56,783 దరఖాస్తులు 
2018-19లో ‘చంద్రన్న బీమా’ కు 56,783 దరఖాస్తులు వచ్చాయని వచ్చాయని, 49,596 దరఖాస్తులను పరిష్కరించామని, రూ.750 కోట్లు మేరకు ప్రయోజనం కలిగించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది 3,640 కుటుంబాలకు ప్రమాద బీమా పరిహారం అందజేశామని వివరించారు. ఈ నాలుగేళ్లలో రూ.2,409 కోట్లతో 1.98 లక్షల దరఖాస్తుదారులకు సాధారణ బీమా పరిహారం అందజేశామని తెలిపారు. మనం ఇంత స్థాయిలో ప్రజలకు లబ్ది చేస్తున్నప్పుడు, మనం చేసిన సహాయాన్ని, విలువను ప్రజలే మనకి వారి సంతోసాన్ని, సంతృప్తిని వివరించేలా ఉండాలని చంద్రబాబు చెప్పారు. బీమా క్లెయిమ్స్ పరిష్కారంలో కేంద్రం నుంచి నిధులు పెండింగ్ లేకుండా చూడాలని సీఎం కోరారు. కేంద్రం కొర్రీలు పెట్టడం, కోతలు విధించడం మామూలైందని, రాష్ట్రం నుంచి ఇవ్వాల్సింది ఇచ్చేయండి, కేంద్రం నుంచి రావాల్సిన వాటికోసం పోరాడదామని ముఖ్యమంత్రి అన్నారు. 
చంద్రన్న పెళ్లి కానుక
రాష్ట్రంలో 2019-19 ఆర్ధిక సంవత్సరంలో 39,602 పెళ్లిళ్లు జరిగాయని, , 2,31 5మందికి 20% చెల్లింపులు చేశామని, 33,528 మందికి 100% చెల్లింపులు చసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. చంద్రన్న పెళ్లి కానుక, గిరిపుత్రికా కళ్యాణ పథకం,బిసి,ఎస్సీ దరఖాస్తులు అన్నింటినీ పరిష్కరించాలని, పెళ్లికానుకల పంపిణీ సక్రమంగా చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సొమ్ము చెల్లింపులో జాప్యం ఉండకూడదని, లోపాలు, అవకతవకలు లాంటి ఆరోపణలు రాకూడదని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి యువనేస్తం 
రూ.80.77 కోట్లు చెల్లింపు 
డిసెంబర్ నెలలో ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ కింద – 3,31,723 మంది లబ్దిదారులకు రూ. 80.77తో యువనేస్తం భృతి అందించామని చంద్రబాబు చెప్పారు. ఈనెలాఖరుకు ముఖ్యమంత్రి యువనేస్తం అర్హుల సంఖ్య 4 లక్షలకు చేరుకుంటుందంని అంచనా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. పెన్షన్లు తీసుకుంటున్న కళాకారులకు ప్రత్యేక శిక్షణనివ్వాలని, వారి సేవలను సద్వినియోగపర్చుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. పెన్షన్లు తీసుకుంటున్న కళాకారులు అందరికీ ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని, కళాకారుల సేవలు సద్వినియోగం చేసుకోవాలని సీఎం ఆదేశించారు.
యువత నైపుణ్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత
యువత నైపుణ్యాలను పెంచడానికి ప్రభుత్వం తరఫున అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, .ఇంజనీరింగ్ పట్టభద్రులలో మన రాష్ట్రమే ముందుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఉన్నత విద్యాశాఖ,నైపుణ్యాభివృద్ధి సంస్థ దీనిపై మరింత దృష్టిపెట్టి దేశంలో మన రాష్ట్రమే ముందుండేలా శ్రద్ధపెట్టాలని సీఎం కోరారు. యువత ఆలోచనలన్నీ వినూత్న ఆవిష్కరణలపైన, నైపుణ్యాభివృద్ధిపైన ఉండేలా మనవంతు కర్తవ్యం నెరవేర్చాలన్నారు.
నైపుణ్య శిక్షణకు సంబంధించి 400 శిక్షణా కేంద్రాలకు తొలిబ్యాచ్ లో 11వేల మంది, రెండవ బ్యాచ్ లో 23 వేల మందికి 2 వారాలపాటు శిక్షణ ఇచ్చామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. శిక్షణకు హాజరైన వారిలో 40% మంది అదనపు నైపుణ్యం పెంచుకున్నారని అధికారులు వివరించగా, సీఎం స్పందిస్తూ ఎంతమంది ఎంపికయ్యారన్న అంశమే నైపుణ్యాభివృద్ధికి గీటురాయి అని చంద్రబాబు అన్నారు. అవసరాన్ని బట్టి అనుసరించి హౌసింగ్ కార్పోరేషన్ ద్వారా రుణాలకు వెళ్లాలని, ప్రభుత్వం తరఫున గ్యారంటీ ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇళ్ల నిర్మాణంలో లబ్దిదారులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ జన్మభూమిలో పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. 
ఫిబ్రవరి నాటికి 352 అన్న క్యాంటీన్లు
ఫిబ్రవరి నాటికి 352 అన్నక్యాంటీన్లు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. 175 నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం ఒక్క అన్నక్యాంటీన్ ప్రారంభించే విధంగా చూడాలని సీఎం సూచించారు. 
గ్రామాలు, పట్టణాల్లో కలిపి 368 అన్న క్యాంటీన్ల ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటికి 165 పూర్తయ్యాయని సీఎం చెప్పారు. మరో 45 అన్నక్యాంటీన్ల నిర్మాణం పురోగతిలో ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే అన్నక్యాంటీన్లలో పేదలకు రెండు పూటలా ఐదు రూపాయిలకే కడుపు నిండా భోజనం, అల్పాహారం లభిస్తున్నాయి. ఒక్కో క్యాంటీన్‌లో ఉదయం 350 మందికి అల్పాహారం, 450 మందికి మధ్యాహ్న భోజనం, మరో 300 మందికి రాత్రి భోజనం అందిస్తున్నారు. ఇప్పటివరకు అన్నక్యాంటీన్ పథకానికి ప్రభుత్వం రూ.31 కోట్లు సబ్సిడీ కింద ఇచ్చింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 44 అన్నక్యాంటీన్లు, కృష్ణాజిల్లాలో 38, తూర్పుగోదావరిలో 39, విశాఖలో 36 అన్నక్యాంటీన్లు ఉన్నాయి. 
వైద్యంపై తగ్గిన తలసరి ఖర్చు 
వైద్యంపై తలసరి ఖర్చు రూ.5770 నుంచి రూ.587కు తగ్గించామని, జేబు నుంచి వైద్యానికి పెట్టే తలసరి వ్యయాన్ని 50% పైగా తగ్గించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :