ASBL NSL Infratech

21వ తానా మహాసభలకు ఏర్పాట్లు ముమ్మరం

21వ తానా మహాసభలకు ఏర్పాట్లు ముమ్మరం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రెండేళ్ళకోమారు నిర్వహించే ద్వైవార్షిక మహాసభలు ఈ సంవత్సరం మే 26, 27, 28 తేదీల్లో సెయింట్‌ లూయిస్‌ నగరంలో జరగనున్నాయి. ఈ మహాసభలను పురస్కరించుకుని http://www.tana2017.org ను ప్రారంభించారు. ఎల్లలు లేని తెలుగు ఎప్పుటికీ వెలుగు అనే సందేశంతో ఈ మహాసభలను నిర్వహిస్తున్నారు. కాన్ఫరెన్స్‌ 21వ మహాసభలకు సంబంధించిన సమాచారాన్ని ఈ వెబ్‌సైట్‌లో చూడవచ్చని అధ్యక్షుడు జంపాల చౌదరి తెలిపారు.

ప్రపంచ నలుమూలలా ఉన్న తెలుగువారు ఈ మహాసభలకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ మహాసభలకు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న చదలవాడ కూర్మనాథ్‌ మాట్లాడుతూ, తానా 40వ పుట్టినరోజు వేడుకలు కూడా ఈ?మహాసభల్లోనే జరుగుతున్నాయని అందుకే ఇది ప్రత్యేకమైన వేడుక అని చెప్పారు. ఈ మహాసభలకు రాజకీయ, సామాజిక సేవారంగం, కళారంగం, సాంస్కృతిక, సినీ రంగాల నుంచి విశిష్ట అతిధులు వస్తున్నారని కూడా తెలిపారు. అచ్చమైన తెలుగింటి రుచులతో విందు భోజనాలు అమెరికాలో యువ తెలుగు కళాకారులకు పట్టం కట్టే ధీం-తానా, పిల్లల కోసం క్యూరీ సైన్స్‌, స్పెల్లింగ్‌, లెక్కల పోటీలను ఈ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసినట్లు తానా నాయకులు చెప్పారు.  ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమన కూడా అందరూ వచ్చి మహాసభలను జయప్రదం చేయవలసిందిగా కోరారు.  రామకృష్ణ వీరవల్లి, జితేంద్ర ఆలూరి, రావ్‌ వల్లభనేని, సురేష్‌ ఎలవర్తి, గోపీ ఉప్పల, శేషు ఇంటూరి, నాగేశ్వరరావు బొప్పన, మురళీ కృష్ణ పుట్టగుంట ఇతర కమిటీల చైర్‌పర్సన్‌లు మహాసభల విజయవంతానికి కృషి చేస్తున్నారు.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :