ASBL NSL Infratech

మాతృ భాషను మృత భాష కానివ్వొదు : ఉప రాష్ట్రపతి

మాతృ భాషను మృత భాష కానివ్వొదు : ఉప రాష్ట్రపతి

తల్లి తర్వాత తల్లి అంతటిది మాతృభాష అని, దానిని మృతభాష కానివ్వవద్దని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆంగ్లం మోజులో పడి మాతృభాష అయిన తెలుగు భాషను మరిచిపోతున్న నేటి రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. తెలుగు భాష గొప్పదనాన్ని భవిష్యత్తు తరాలకు చాటిచెప్పేలా ఈ మహాసభలు జరుగుతున్నాయని ప్రశంసించారు. ఎల్‌బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగువారంతా ఒక్కటేనని నేను నమ్ముతాను. దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఎక్కడైనా తెలుగు మాట వినిపిస్తే వెనకుక తిరిగి చూసేవాడిని.వారిని పలకరించి స్నేహితులను చేసుకునే వాడిని. తెలుగులో మాట్లాడుతుంటే నా మనస్పు ఆనందంతో పులకరించేంది అని అన్నారు.

తెలుగువారి విషయంలో తనకు తరతమభేదాలు లేవని, నెలకు ఒక్కసారైనా నేను పెరిగిన తెలంగాణలో, పుట్టిన ఆంధ్రలో కాలుపెట్టకపోతే ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ చేసిన ప్రసంగం తన మనసుకు ఎంత సంతోషం కలిగించిందో మాటల్లో చెప్పలేనన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి తన పాతనాటి మాటలను గుర్తుపెట్టుకుని, తన గురువును పిలిచి వేదికపైన అందరిముందు సత్కరించటం మనందరిలో సత్ప్రవర్తనను, సదాచారాన్ని గుర్తుచేసేలా ఉంది. భాష అనేది అది మాన సంబంధాల అభివృద్ది క్రమంలో ఏర్పడిన వ్యక్తీకరణ అన్నారు. అమ్మభాష కోసం తెలంగాణలో నాటితరం భారీ ఉద్యమాలు, పెనుపోరాటాలు చేయాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఇక్కడ తెలుగు భాషను ప్రజలు కాపాడుకున్నారని అని వెంకయ్య గుర్తు చేశారు.

Tags :