ASBL NSL Infratech

డెలావేర్‌లో టీం వేమూరి ఎన్నికల ప్రచారం

డెలావేర్‌లో టీం వేమూరి ఎన్నికల ప్రచారం

తానా ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో టీమ్‌వేమూరి ప్రచారాన్ని ఉధృతంచేసింది. గత వారాంతం డెలావేర్‌ లో తానా సభ్యులతో ముఖాముఖి నిర్వహించింది. తమ టీమ్‌ కు ఉన్న బలాన్ని తానాను సమర్థవంత్‌గా నిర్వహించాలంటే తమకే ఎందుకు వోట్‌ వెయ్యాలి వంటి విషయాలను వివరించింది.

ఈ ప్రచార కార్యక్రమాలను తానా మాజీ అధ్యక్షులు జయ్‌ తాళ్లూరి, తానా ప్రస్తుత అధ్యక్షులు నిరంజన్‌ శృంగవరపు ఈ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి సతీష్‌ వేమూరి లీడ్‌ చేస్తున్నారు. వీరితోపాటు పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులు శ్రీనివాస్‌ ఉయ్యూరు, అశోక్‌ కొల్లా, సత్యనారాయణ మన్నే, శిరీష తూనుగుంట్ల, సుమంత్‌ రాంశెట్టి, వంశీ వాసిరెడ్డి, శ్రీరామ్‌ ఆలోకం, భాస్కర్‌ మల్లినేని మరియు సపోర్టర్స్‌ లక్ష్మణ్‌ పర్వతనేని తదితరులు పాల్గొన్నారు.

 

 

Tags :