ASBL NSL Infratech

నల్లగొండ జిల్లాలో టీటీఏ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

నల్లగొండ జిల్లాలో టీటీఏ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

టీటీఏ సేవాడేస్‌ కార్యక్రమాల్లో భాగంగా నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో ఆలయ నిర్మాణానికి టిటిఎ నాయకులు సహకారం అందించి ప్రారంభించారు. గణేశ్‌ మాధవ్‌, వీరమన్‌ (గని) ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అలాగే గ్రామంలోని పేదలకు దుప్పట్లను కూడా టిటిఎ నాయకులు పంపిణీ చేశారు. టీటీఏ ఎథిక్స్‌ కమిటీ డైరెక్టర్‌  గణేష్‌ వీరమనేని స్వగ్రామం నల్గొండ జిల్లా, పెండ్లిపాకల గ్రామంలో ముత్యాలమ్మ దేవాలయ ప్రారంభోత్సవంలో టీటీఏ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పేద ప్రజలకు దుప్పట్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న టీటీఏ సంస్థను గ్రామ ప్రజలు కొనియాడారు. కార్యక్రమంలో టిటిఎ ముఖ్య నాయకులు పలువురు పాల్గొన్నారు. టిటిఎ ప్రెసిడెంట్‌ కంచరకుంట్ల వంశీ రెడ్డి, ప్రెసిడెంట్‌-ఎలెక్ట్‌  నవీన్‌ రెడ్డి మల్లిపెద్ది, సేవా డేస్‌ కోఆర్డినేటర్‌ వెంకన్నగారి సురేష్‌ రెడ్డి, కమ్యూనిటీ సర్వీసెస్‌ చైర్‌ నర్సింహ పెరుక, జాయింట్‌ ట్రెజరర్‌ మనోహర్‌ బోడ్కే, మయూర్‌ బండారు చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామపెద్దలు, ఇతరులు టీటిఎ నాయకులకు ధన్యవాదాలు చెప్పారు. 

 

 

Tags :