ASBL NSL Infratech

మోహన్ రెడ్డి పటోళ్ల ఆధ్వర్యంలో నెమలి లో టీటిఏ కార్యక్రమాలు

మోహన్ రెడ్డి పటోళ్ల ఆధ్వర్యంలో నెమలి లో టీటిఏ కార్యక్రమాలు

నిజామాబాద్ జిల్లాలో నెమలి గ్రామం TTA అడ్వైసరీ చైర్ మోహన్ రెడ్డి పటోళ్ల గారి స్వంత గ్రామం ..పూర్తిస్థాయిలో స్వంత నిధులతో  నిర్మించిన సాయిబాబా దేవాలయం TTA సభ్యులు అందరూ దర్శించుకొని పునితులైనారు.

తదనంతరం గ్రామంలోని స్కూల్ కు అనేక రకాలుగా సహకరించారు. గుడి, బడి, హాస్పిటల్ నిర్మించి నెమలి గ్రామం లో ఏర్పాటు చేసిన ఘనత మోహన్ రెడ్డి పటోళ్ల గారిది... తాజాగా ఈరోజు స్కాలర్ షిప్ సెర్మని బాన్సువాడ కస్టుయేన్సీ లో TTA అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

స్కూల్ ప్రధాన అధ్యాపకులు దుర్గాబాయి గారు మాట్లాడుతూ మోహన్ రెడ్డి పటోళ్ల గారు మార్గదర్శనం అని అన్నారు. పాటశాల కు చేసిన సేవలకు ధన్యవాదాలు తెలిపారు. స్కూల్ పిల్లల ఉపన్యాసాలు TTA సభ్యులను ఆకట్టుకున్నాయి.

TTA నాయకులు మోహన్ రెడ్డి పటోళ్ల గారు మాట్లాడుతూ స్వంత గ్రామం నెమలి లో అన్ని కార్య్రమాలూ చేయలేకపోయాను అని విచారం వ్యక్తం చేశారు... స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని తెలిపారు. కామారెడ్డి జిల్లా లో ఉన్న ప్రతి ఒక్క దివ్యాంగుల కు కృత్రిమ అవయవాలు ఇప్పించే పని త్వరలో చేస్తామని ప్రకటించారు. రానున్న పదేళ్లలో మిగిలిన జీవితం ఇక్కడే నెమలి గ్రామం లో జీవించాలని ఆలోచన ఉందని తెలిపారు. ఒక నెలరోజుల్లో పాటశాల లో కంప్యూటర్ లాబ్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. అందరి కోరిక మేరకు తన కూతురు ను వచ్చే సారి తీసుకువస్తానని తెలిపారు.

TTA నాయకులు విజయ పాల్ రెడ్డి గారు మాట్లాడుతూ దేవాలయం, పాటశాల, హాస్పిటల్ కట్టిన ఘనత మోహన్ రెడ్డి పటోళ్ల గారికి దక్కింది అని తెలిపారు.

TTA ప్రెసిడెంట్ వంశీ రెడ్డి గారు మాట్లాడుతూ బాబా దర్శనం ఇక్కడ కలగటం రెండవసారి అని గుర్తు చేసుకున్నారు...పిల్లల్ని ఉత్సాహపరుస్తూ మోహన్ రెడ్డి గారి కి స్కౌట్ క్లాప్ తో కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలు అందరూ అమెరికా కి వెళ్ళడానికి కృషి చేయాలని ప్రోత్సహించారు. నెమలి గ్రామం నుంచి ఇంకో వంద మంది మోహన్ రెడ్డి లు తయారుకావలని ఆశించారు.

నవీన్ రెడ్డి మలిపెద్ది TTA ప్రెసిడెంట్ ఎలెక్ట్ మాట్లాడుతూ దాదాపు పది రోజుల నుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఇంకపై మరింత ఉత్సాహం గా సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.

TTA జనరల్ సెక్రటరీ కవిత రెడ్డి గారు మాట్లాడుతూ తన విద్యార్థి దశ ను గుర్తు చేసుకున్నారు. హార్డ్ వర్క్ మాత్రమే జీవితం లో మనల్నీ నిలబెడుతుంది అని అన్నారు.

TTA సేవా డేస్ కో ఆర్డినేటర్ సురేష్ రెడ్డి గారు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్ కార్యాచరణ అభివృద్ది దిశగా కొనసాగాలని కోరుకున్నారు.

TTA నాయకులు ప్రదీప్ మెట్టు గారు మాట్లాడుతూ మోహన్ రెడ్డి పటోళ్ల గారి విద్యార్థి దశలోనే సాధించిన విజయాలు వివరించారు. ఆయన నుంచి అందరం ఇన్స్పిరేషన్ కావాలని ఆశించారు.

TTA నాయకులు మనోహర్ గారు మాట్లాడుతూ 15రోజులుగా ప్రతి గ్రామం తిరుగుతున్నామని... సమస్యలు TTA బృందం వెనువెంటనే తీర్చడం చాలా అందంగా ఉందని తెలిపారు.

కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరమణ గారు మాట్లాడుతూ నెమలికి ఒక ఐడెంటిటీ ఇచ్చన మహా మనిషి మోహన్ రెడ్డి పటోళ్ల గారు అని అన్నారు.

తదనంతరం బాన్స్ వాడ నియోజక వర్గంలో లో ప్రతి మండలంలో ఒకరికి ఇంటర్ లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 10వేల రూపాయల స్కాలర్ షిప్ ను అందజేశారు.

వాలీబాల్ లో నేషనల్ లో ఆడిన అమ్మాయిల జట్టును TTA బృందం అభినందించింది...వారిని శాలువాలతో వారిని సత్కరించారు మోహన్ రెడ్డి పటోళ్ల గారు.

గ్రామస్థులు అందరూ స్కూల్ అధ్యాపకులు TTA అడ్వైసర్ మోహన్ రెడ్డి పటోళ్ల గారి కి మరియు వీజయపాల్ గారికి, ప్రెసిడెంట్ వంశీ రెడ్డి గారికి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి గారి తో పాటు అందరూ TTA సభ్యులను శాలువాతో సన్మానించి పూలమాల తో సత్కరించారు.

 

Click here for Photogallery

 

 

Tags :