ASBL NSL Infratech

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన టీటిఎ నాయకులు

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన టీటిఎ నాయకులు

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) ఆధ్వర్యంలో తెలంగాణలో నిర్వహిస్తున్న సేవాడేస్‌ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో పలువురు టీటిఎ నాయకులు పాల్గొంటున్నారు. అదే సమయంలో వచ్చే సంవత్సరం సీటెల్‌లో మే 24 నుంచి మే 26 వరకు నిర్వహించే టిటిఎ మెగా కన్వెన్షన్‌కు రావాల్సిందిగా పలువురు ప్రముఖులను టిటిఎ నాయకులు స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టీటిఎ నాయకులు కలిసి కాన్ఫరెన్స్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే మాజీ మంత్రి హరీష్‌ రావును కూడా కలిసి ఆహ్వానించారు. డిసెంబర్‌ 23న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే టిటిఎ సేవాడేస్‌ కార్యక్రమాల ముగింపు వేడుకలకు కూడా రావాల్సిందిగా ఆహ్వానించారు.

 

Click here for Photogallery

 

 

 

Tags :