ASBL NSL Infratech

ఫిలడెల్ఫియాలో ఘనంగా టీటీఏ మెగా కన్వెన్షన్ కికాఫ్ ఈవెంట్

ఫిలడెల్ఫియాలో ఘనంగా టీటీఏ మెగా కన్వెన్షన్ కికాఫ్ ఈవెంట్

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్ కోసం ఫిలడెల్ఫియాలో కికాఫ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించిన టీటీఏపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీటీఏ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజు, జనరల్ సెక్రటరీ కవితా రెడ్డి, కోకన్వీనర్ గణేష్ మాధవ్ వీరమనేని, కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ నరసింహ పేరుక తదితరులందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ వేడుకను అద్భుతంగా నిర్వహించిన ఫిలడెల్ఫియా టీం సభ్యులు నరసింహా రెడ్డి దొంతిరెడ్డి, సురేష్ రెడ్డి వెంకన్నగిరి, ప్రసాద్ కునరపు, రమణ కోత, కిరణ్ గూడూరు, భాస్కర్ పిన్న, వంశీ గుల్లపల్లి, వేణు ఏనుగుల, శివ రెడ్డి, అరుణ్ మేకల, హరి పైరెడ్డి, రవీందర్ గట్ల, గౌతమ్ వేపూర్, మహేష్ శంబు, ప్రదీప్ కాయిడపురం, కార్తిక్ కుర్వీ, సతీష్ సాకిలం, విశాల్ దాసరి, ప్రతీక్, ప్రణీత్, హరి పైరెడ్డి, ప్రమోద్, పూర్తి ఫిలడెల్ఫియా టీంకు టీటీఏ శుభాకాంక్షలు తెలిపింది. ఈ మెగా కన్వెన్షన్ కికాఫ్, ఫండ్ రైజింగ్ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడంలో ఫిలడెల్ఫియా టీం కృషి ఎంతో ఉందని టీటీఏ తెలిపింది. ఈ ఫండ్‌ రైజింగ్ కమిటీని నవీన్ మల్లిపెద్ది ఎంతో నైపుణ్యంతో ముందుకు తీసుకెళ్తున్నట్లు కొనియాడారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులు అందరికీ టీటీఏ కృతజ్ఞతలు తెలిపింది.

 

Click here for Photogallery

 

 

 

Tags :