ASBL NSL Infratech

టీటీఏ మెగా కన్వెన్షన్ కోసం భారీగా విరాళాలు సేకరించిన న్యూయార్క్ శాఖ

టీటీఏ మెగా కన్వెన్షన్ కోసం భారీగా విరాళాలు సేకరించిన న్యూయార్క్ శాఖ

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ 2024 కోసం వివిధ స్టేట్స్‌లోని సంస్థ కేంద్రాలు విరాళాలు సేకరించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే టీటీఏ న్యూయార్క్ కూడా ఘనంగా కికాఫ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా టీటీఏ న్యూయార్క్ శాఖ మిగతా శాఖల కన్నా మెరుగైన ప్రదర్శన చేసింది. ఏకంగా 5.23 లక్షల డాలర్ల విరాళం సేకరించింది. ఈ వేడుకలు ఇంత ఘనవిజయం సాధించడానికి టీటీఏ వ్యవస్థాపకులు పైళ్ల మల్లారెడ్డి మంచి మనసే కారణమని నిర్వాహకులు తెలిపారు. టీటీఏ ప్రెసిడెంట్ కంచరకుంట్ల వంశీ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీర్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజు, జనరల్ సెక్రటరీ కవితా రెడ్డి, కోకన్వీనర్ గనేష్ మాధవ్ వీరమనేని తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని కమ్యూనిటీ సభ్యుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా న్యూయార్క్ టీం సభ్యులు సహోదర్ పెద్దిరెడ్డి, ఉషా మన్నెం, మల్లిక్ రెడ్డి, పవన్ రవ్వ, రమ వనమ, శ్రీనివాస్ గూడూరు తదితరుల కృషిని కూడా ఈ సందర్భంగా మెచ్చుకున్నారు. అలాగే ఈ వేడుకల్లో సేకరించిన 5.63 లక్షల డాలర్ల విరాళం.. ఈ సంస్థ పట్ల కమ్యూనిటీ సభ్యులకు ఉన్న నమ్మకానికి అద్దం పడుతోందని నిర్వాహకులు పేర్కొన్నారు.

 

Click here for Photogallery

 

 

Tags :