ASBL NSL Infratech

విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్న ఠాగూర్‌ మల్లినేని.. పెనమలూరు విద్యార్థులకు తానా స్కాలర్‌ షిప్‌ లు పంపిణీ

విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్న ఠాగూర్‌ మల్లినేని.. పెనమలూరు విద్యార్థులకు తానా స్కాలర్‌ షిప్‌ లు పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ద్వారా అమెరికాలోనే కాకుండా, తన సొంతూరు పెనమలూరు అభివృద్ధికి ఠాగూర్‌ మల్లినేని కృషి చేస్తున్నారు. అందులో భాగంగా పేద విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ లు, రైతులకు పవర్‌ స్ప్రేయర్లు, రక్షణ పరికరాలు, మహిళలకు కుట్టుమిషన్‌లు, వికలాంగులకు ట్రై సైకిళ్ళు వంటివి ఇవ్వడం ద్వారా వారి సంక్షేమానికి తనవంతుగా తోడ్పాటును అందిస్తున్నారు. అక్టోబర్‌ 1వ తేదీన పెనమలూరు లోని 15 మంది పేద విద్యార్థులకు మరోసారి స్కాలర్‌ షిప్‌ లను ఆయన పంపిణీ చేశారు. అలాగే సొంతూరు అభివృద్ధికి తన సేవలు నిరంతరం కొనసాగుతుందని, తానా ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధికి మరింతగా కృషి చేస్తానని ఠాగూర్‌ మల్లినేని చెప్పారు. 

తానాలో మీడియా కో ఆర్డినేటర్‌గా పనిచేసినప్పుడు తానా సేవలు, కార్యక్రమాలను ఇక్కడి పత్రికల ద్వారా అందరికీ తెలియజేయడంలో ఆయన చేసిన కృషి తెలిసిందే. అలాగే తానా ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌ పదవికి ఆయనను ఎంపిక చేసినప్పుడు కూడా తానాకోసం తనవంతుగా సేవలను అందిస్తూ వస్తున్నారు. తానా ఫౌండేషన్‌ సహకారంతో పలు కార్యక్రమాలను చేస్తున్న ఠాగూర్‌ మల్లినేని భవిష్యత్తులో కూడా కమ్యూనిటికీ అటు అమెరికాలనూ, ఇటు రాష్ట్రంలో ఎల్లప్పుడూ కొనసాగుతుందని చెప్పారు.

ఈ సందర్బంగా తానా చేయూత కో ఆర్డినేటర్ శశికాంత్ వల్లేపల్లి, వెంకటరమణ యార్లగడ్డ, అంజయ్య చౌదరి లావు, నిరంజన్ శృంగవరపు లను విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. పెనమలూరు ఎన్నారై స్థానిక ప్రతినిధులు పాలడుగు సుధీర్,మోర్ల నరేంద్ర బాబు, కిలారు ప్రవీణ్, కోనేరు సాంబశివరావు తదితరులు ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు.

 

Click here for Photogallery

 

 

 

Tags :