ASBL NSL Infratech

తానా న్యూ ఇంగ్లాండ్‌ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

తానా న్యూ ఇంగ్లాండ్‌ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

తానా న్యూ ఇంగ్లండ్‌ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సుమారు 200 మంది పాల్గొన్న ఈ వేడుకలలో 77 సంవత్సరాల క్రితం భారతదేశం స్వాతంత్య్రకోసం ఎంత కష్టపడిందో తానా న్యూ ఇంగ్లండ్‌ మాజీ ఆర్‌ఆర్‌ కొల్లిపర శ్రీనివాస్‌, టిఎజిబి మాజీ అధ్యక్షులు శంకర్‌ మగపు వివరించారు. ఈ కార్యక్రమంలో తానా న్యూ ఇంగ్లండ్‌ ఆర్‌ఆర్‌ కృష్ణ ప్రసాద్‌ సోంపల్లి, సురేష్‌ దోనేపూడి, భార్గవ్‌ ప్రక్కి, బిగ్‌ హెల్ప్‌ అధ్యక్షులు చాంద్‌, అమర్‌ జయం, అనిల్‌ శ్రీనివాస్‌ గోండి, అంకినీడు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారికి తానా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు, ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి ధన్యవాదాలు తెలిపారు.

 

Click here for Photogallery

 

 

Tags :