ASBL NSL Infratech

తానా ఉపకారవేతనాలు

తానా ఉపకారవేతనాలు

విద్యలో ప్రతిభ కనబరుస్తున్న 35 మంది పేద విద్యార్థులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఉపకార వేతనాలు అందించింది. హైటెక్సిటీలోని క్యూహబ్ లో తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రతిభగల పేద విద్యార్థులకు ప్రోత్సహించాలన్న లక్ష్యంగా ‘చేయూత’ పేరుతో ప్రతి ఏటా ఉపకారవేతనాలు అందిస్తున్నామని శశికాంత్ వల్లేపల్లి పేర్కొన్నారు. ఉపకారవేతనాలు అందుకున్న విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరుచుకుని విజయం సాధించాలని ఆకాంక్షించారు.ఉప్పుటూరి రామ్ చౌదరి, బీఆర్ఎస్ నేత రాహుల్ రావు తదితరులు పాల్గొన్నారు.

 

 

Tags :