ASBL NSL Infratech

పేద విద్యార్థులకు తానా బ్యాగుల పంపిణీ

పేద విద్యార్థులకు తానా బ్యాగుల పంపిణీ

అమెరికాలోని పేదవాళ్ళకు సహాయం చేసేందుకు వీలుగాఉత్తర అమెరికా తెలుగు సంఘం మాజీ అధ్యక్షుడు డా. నవనీతకృష్ణ గొర్రెపాటి ప్రవేశపెట్టిన తానా బ్యాక్‌ప్యాక్‌ పథకంలో భాగంగా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు ఆధ్వర్యంలో డిట్రాయిట్‌లో తానా నాయకులు గోంపర్స్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 553 బ్యాగులను పంపిణీ జేశారు. తానా నాయకులు సురేష్‌ పుట్టగుంట, చిలుకూరి రాంప్రసాద్‌, జంపాల విష్ణులు ఈ కార్యక్రమానికి సహకరించి విజయవంతమయ్యేలా కృషి చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ సభ్యుడు తానేదార్‌, తానా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపులు ముఖ్య అతిథిగా హాజరయి బ్యాగులను పంపిణీ చేసి నిర్వాహకులను అభినందించారు.

 

Click here for Photogallery

 

 

 

 

 

Tags :