ASBL NSL Infratech

న్యూజెర్సీలో తానా ఆధ్వర్యంలో గంగాధర శాస్త్రి గీతాగాన ప్రవచనం

న్యూజెర్సీలో తానా ఆధ్వర్యంలో గంగాధర శాస్త్రి గీతాగాన ప్రవచనం

న్యూజెర్సీలోని నార్త్‌ బ్రూసివిక్‌ లో ఉన్న ‘సాయి పరివార్‌ మందిరం’లో భగవద్గీతా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డా ఎల్‌ వి గంగాధర శాస్త్రి గీతాగాన ప్రవచనం ఘనంగా జరిగింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం, సాయి పరివార్‌ సంస్థలతోపాటు, ధార్మిక వరేణ్యుడైన శ్రీ ఊటుకూరి ప్రసాద్‌ నిర్వహణలో జరిగిన ఈ గీతా సత్సంగం కార్యక్రమంలో శ్రీ గంగాధర శాస్త్రి భగవద్గీతా వైభవంపై గాన ప్రవచనం చేశారు.

టివీ 5 అమెరికాశాఖ సిఇఓ మన టివి వ్యవస్థాపకులు శ్రీధర్‌ చిల్లర, ‘తానా’ ప్రతినిధులు శ్రీమతి లక్ష్మి దేవినేని, రాజా కసుకుర్తి, రామకృష్ణ వాసిరెడ్డి, న్యూజెర్సి ప్రముఖులు దాము గేదల, ఉపేంద్ర చివుకుల, సత్య నేమాని, సుధీర్‌ నారెపాలెపు తదితరులు గంగాధర శాస్త్రిని సత్కరించి ‘ధార్మిక శిరోమణి’ బిరుదుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 70మందికిపైగా పాల్గొన్నారు.

 

 

Tags :